చిరంజీవికి అస్సలు కలిసి రాని ఆ పాత్రలు.. ఎన్ని ఫ్లాపులు వచ్చాయో తెలుసా..?

Pulgam Srinivas
తెలుగు సినిమా పరిశ్రమలో తెలుగు లేని నటుడిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ఈయన ఎవరి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి ఒక్కో విజయాన్ని అందుకుంటూ ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోగా ఎదిగాడు. ఇప్పటికీ కూడా అదే స్థాయిలో కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి ఎన్నో అద్భుతమైన పాత్రలతో ఎన్నో విజయాలను అందుకున్నాడు. కానీ ఆయన కెరియర్లో కొన్ని సినిమాల్లో రెండు పాత్రలలో కూడా నటించాడు.

చిరంజీవి డ్యూయల్ రోల్ లో నటించిన సినిమాల ద్వారా ఈయనకు చాలా సినిమాల ద్వారా మంచి విజయాలు వచ్చిన ఈయన యంగ్ మరియు వయస్సు పైబడిన పాత్రలో నటించిన సినిమాల ద్వారా మాత్రం ఎక్కువ శాతం అపజయాలనే అందుకున్నాడు. కెరియర్ ప్రారంభంలో చిరంజీవి సింహపురి సింహం అనే సినిమాలో చిరంజీవి రెండు పాత్రలలో నటించాడు. ఇందులో ఒక పాత్రలో యంగ్ గాను , మరొక పాత్రలో ముసలి పాత్రలో కనిపించాడు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత ఈయన రిక్షావోడు అనే సినిమాలో కూడా తండ్రి , కొడుకుల పాత్రలో నటించాడు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక స్నేహం కోసం అనే సినిమాలో కూడా చిరంజీవి రెండు పాత్రలో నటించగా ఒక పాత్రలో కొడుకు గానూ , మరో పాత్రలో తండ్రిగా నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా పరవాలేదు అనే స్థాయి విజయాన్ని మాత్రమే అందుకుంది. ఇక కొన్ని సంవత్సరాల క్రితం చిరంజీవి "అందరివాడు" అనే సినిమాలో హీరోగా నటించాడు.

అందులో చిరంజీవి ఒక పాత్రలో యంగ్ గా కనిపిస్తే మరొక పాత్రలో వయసు పైబడిన వ్యక్తిగా కనిపించాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా చిరు రెండు పాత్రలలో నటించి ఒక పాత్రలో యంగ్ గా , మరొక పాత్రలో వయస్సు పైబడిన వ్యక్తిగా కనిపించిన సినిమాల్లో చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: