కోహ్లీ రోహిత్ కాదు.. నితీష్ రెడ్డి ఆరాధ్య క్రికెటర్ ఎవరో తెలుసా?
ఇక ప్రతి మ్యాచ్ లో కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడి అదర గొట్టేశాడు. టీమిండియా కు ఫ్యూచర్ స్టార్ తానే అన్న విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా చేస్తాడు నితీష్ కుమార్ రెడ్డి. ఇక ఈ తెలుగోడి వీరుచితమైన పోరాటం చూసి క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఫిదా అయిపోయారు అని చెప్పాలి. అయితే ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నితీష్.. తనకు రోల్ మోడల్ క్రికెటర్ ఎవరు అనే విషయాన్ని చెప్పుకొచ్చాడు. సాధారణంగా భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చే ప్రతి యువ క్రికెటర్ కూడా ధోని కోహ్లీ రోహిత్ లాంటి ప్లేయర్లను రోల్ మోడల్ గా తీసుకొని క్రికెట్ వైపు అడుగులు వేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.
అయితే అటు తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి మాత్రం మరో క్రికెటర్ పేరు చెప్పడం గమనార్హం. ఏకంగా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అంటే తనకు ఎంతో ఇష్టం అంటూ చెప్పుకొచ్చాడు. అతని నుంచి ఎప్పుడు స్ఫూర్తి పొందుతాను అంటూ నితీష్ కుమార్ రెడ్డి అన్నాడు. అదే సమయంలో బెన్ స్టోక్స్ ను కూడా ఎంతగానో ఆరాధిస్తాను అంటూ నితీష్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చాడు. అయితే ఈ తెలుగు క్రికెటర్ ఐపీఎల్లో ప్రదర్శన ఆధారంగా అటు టీమ్ ఇండియా నుంచి పిలుపును కూడా అందుకున్నాడు. జింబాబ్వే పర్యటనకు ఎంపికైన నితీష్ కుమార్ రెడ్డి దురదృష్టవశాత్తు గాయంతో ఆఖరి నిమిషంలో జట్టుకు దూరమయ్యాడు.