నరైన్ టీమ్ మీటింగ్స్ కి రాడు.. శ్రేయస్ అయ్యర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?
ఒకప్పుడు కెప్టెన్ గా కోల్‌కతా జట్టుకి టైటిల్ అందించిన గౌతమ్ గంభీర్ ఇక ఇప్పుడు ఆ జట్టుకు మెంటర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలోనే గౌతమ్ గంభీర్ రాకతో ఇక కోల్‌కతా జట్టులో ఎంతగానో దూకుడు పెరిగిపోయింది అని చెప్పాలి. ఇక ప్రతి మ్యాచ్ లో కూడా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటుంది కోల్‌కతా జట్టు. మరి ముఖ్యంగా అటు బౌలర్ సునీల్ నరైన్ ను ఓపెనర్ గా పంపించి సాహసం చేశాడు గౌతమ్ గంభీర్. చివరికి ఈ ప్లాన్ తో సక్సెస్ అయ్యాడు. ఓపెనర్ గా బరిలోకి దిగుతున్న సునీల్ నరైన్ బ్యాటింగ్ లో సృష్టిస్తున్న విధ్వంసం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇప్పటివరకు 9 మ్యాచులు ఆడిన కోల్‌కతా జట్టు ఆరు విజయాలతో పాయింట్స్ పట్టికలో రెండవ స్థానంలో కొనసాగుతుంది ఒకరకంగా కోల్‌కతా జట్టు విజయాలలో అటు ఓపెనర్లు కీలకపాత్ర వహిస్తున్నారు అని చెప్పాలి. కాక ఇలా ఈ ఐపీఎల్లో తమ జట్టు ఓపెనర్ల ప్రదర్శన పై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ కు ముందు ఓపెనర్లతో చర్చిస్తారా అనే ప్రశ్నకు స్పందిస్తూ.. లేదు ఫిలిప్ సాల్ట్ టీమ్ మీటింగ్స్ కి హాజరవుతారు. పూర్తిగా ఆటలో లీనమైపోతారు. కానీ నరైన్ అలా కాదు అతడు టీం మీటింగ్స్ కి రారు. రావద్దని నేను కూడా చెబుతాను అంటూ నవ్వేసాడు శ్రేయస్ అయ్యర్.