ఏపీ: ఓటమి భయంతో చిన్నమ్మ చింత..!

Divya
రాష్ట్రంలో కూటమి ఏర్పడడానికి ముఖ్య కారణం అటు పవన్ కళ్యాణ్ పురందేశ్వరి అని చెప్పవచ్చు.. వీరిద్దరి  వల్ల టిడిపి ఆంధ్రాలో కాస్త ఊపునిచ్చిందని కూడా చెప్పవచ్చు.. కూటమిలో భాగంగా సీట్లను కూడా పంచుకోవడం జరిగింది.. ముఖ్యంగా రాజమండ్రి నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి గా పురందేశ్వరి నిలబడింది.. ఓటింగ్ ప్రక్రియ కూడా ఈనెల 13వ తేదీన అయిపోయింది.. వినిపిస్తున్న సమాచారం మేరకు కూటమి అభ్యర్థులలో అంతర్ మదనం జరుగుతోంది. ఎంపీ అభ్యర్థి గెలుపు పైన సొంత కూటమిలోని అనుమానాలు మొదలవుతున్నాయి

టిడిపి, బిజెపి ,జనసేన కూటమిగా ఏర్పడిన అభ్యర్థులు మాత్రం స్థానిక నేతలకు సహకరించలేదని వార్తలు వినిపిస్తున్నాయి. కూటమిలో నిజంగా మూడు పార్టీలు కలిసి పనిచేశారో లేదో డౌట్లు కూడా మొదలవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలలో కీలక ఘట్టమైన.. పోలింగ్ ముగిసి వారం అవుతున్నప్పటికీ.. ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలలో బరిలోకి దిగిన అభ్యర్థులు గెలుపోటముల పైన రకరకాల లెక్కలు వేస్తున్నారు. ముఖ్యంగా పోలింగ్ సరళి పైన లెక్కలతో కుస్తీలు పడుతున్నారు. ఏ వర్గం వారు ఎవరు అండగా నిలిచారో తెలియక సతమతమవుతున్నారు.

కూటమిలో భాగంగా వలస అభ్యర్థులలో మాత్రం గెలుపుపై అసహనం కనిపిస్తోంది. ముఖ్యంగా నేతలు కార్యకర్తలు నిజంగానే తమకు మద్దతు తెలిపారా లేకపోతే వెన్నుపోటు పొడిచారు అనే విషయం తెలియక సతమతమవుతున్నారు. కడుపులో కత్తులు పెట్టుకొని పైకి మాత్రం కౌగిలింతలు ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. బయట తమతో తిరుగుతూనే ఓటు వేయించాల్సిన సమయంలో సైలెంట్ అయిపోయారేమో అనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి.. ఒకవేళ ఇదే జరిగితే చాలామంది నేతల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారుతుంది. రాజమండ్రి పార్లమెంటుకు బిజెపి అభ్యర్థిగా పురందేశ్వరి నిలబడింది. రాజమండ్రి రూరల్, రాజమండ్రి సిటీ, కొవ్వూరు, గోపాలపురం  అసెంబ్లీ స్థానాల నుంచి టిడిపి అభ్యర్థులు పాల్గొన్నారు.

రాజానగరం, నిడదవోలు స్థానాలలో జనసేన అభ్యర్థులు పోటీ చేశారు. అనపర్తి స్థానంలో బిజెపి అభ్యర్థి పోటీ చేశారు. ఏడు స్థానాలలో ఎమ్మెల్యేలు తమకే ఓటు వేయాలని సూచించారు.. అయితే ఎంపీ ఓటు మీ ఇష్టం అన్నట్లుగా తెలియజేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. రాజమండ్రి పార్లమెంట్ సీటు పైన బీజేపీ చేసిన సర్వేలో కూడా ఇదే విషయం తేలిందట. ముఖ్యంగా ఓటు వేయమని డబ్బులు పంచే సమయంలో కూడా పార్లమెంటుకు బిజెపికి ఓటు వేయమని ఎవరు చెప్పలేదట. దీన్నిబట్టి చూస్తే చిన్నమ్మకు కూటమి అభ్యర్థుల వెన్నుపోటు పొడిచారని చెప్పవచ్చు. మరి ఏం జరుగుతుంది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: