క్వాలిఫైయర్-1.. మనోళ్లే గెలుస్తారట?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా నేను ఒక ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమైంది. మార్చి 22వ తేదీ నుంచి లీగ్ మ్యాచ్ లతో ప్రేక్షకులందరిని అలరిస్తూ వచ్చిన ఐపిఎల్.. ఇక ఇప్పుడు నాకౌట్ మ్యాచ్లతో ప్రేక్షకులను ఉత్కంఠతో మునివేళ్లపై నిలబెట్టడానికి సిద్ధమైంది. ఇక నేటి నుంచి ఐపీఎల్ నాకౌట్ మ్యాచ్లు జరుగుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాలలో నిలిచిన కోల్కతా, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది. మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్లో భాగంగా ఈ రెండు టీమ్స్ తలబడబోతున్నాయి అని చెప్పాలి.

 అయితే ఈ ఐపీఎల్ సీజన్లో ఈ రెండు టీమ్స్ కూడా అద్భుతమైన ప్రదర్శన సాగిస్తూ దూసుకు వచ్చాయి. ఇక ఎవరికి వారే సాటి అన్న విధంగా ప్రదర్శన చేసాయ్. బౌలింగ్ బ్యాటింగ్ లో కూడా అదరగొట్టాయ్. మరీ ముఖ్యంగా  కోల్కతా ఓపెనర్లు ఇటు సన్రైజర్స్ ఓపెనర్లు బ్యాటింగ్లో సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదు. ఏకంగా ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించే విధంగా ఈ జట్లు ప్రస్తానాన్ని కొనసాగించాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే  ఈ రెండు టీమ్స్ మధ్య మొదటి మ్యాచ్ జరగబోతుంది. దీంతో ఇక ఈ మ్యాచ్ లో ఎవరు విజేతగా నిలవబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి.

 అయితే ఐపీఎల్ లో భాగంగా నేడు జరగబోతున్న మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్న విషయాన్ని ఇటీవల స్టార్ స్పోర్ట్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సామాజిక మాధ్యమాల్లో ఏకంగా 51 శాతం మంది సన్రైజర్స్ అనుకూలంగా ఓటు వేస్తే.. 49 శాతం మంది కోల్కతాకు విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఓటు వేశారు. ఏది ఏమైనా రెండు టీమ్స్ మధ్య హోరాహోరి పోరు జరగడం ఖాయమని స్టార్ స్పోర్ట్స్ తెలిపింది. గుజరాత్ లో ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు జరగబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: