2025 లో టాలీవుడ్ తలరాతని మార్చేసిన టాప్ 5 చిత్రాలు ఇవే..వెరీ స్పెషల్..!
అయితే, కంటెంట్ పరంగా ప్రేక్షకులను అలరించడమే కాకుండా, వసూళ్ల పరంగా కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించిన సినిమాలు మాత్రం ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్‌కు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. మరి 2025లో టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసి, వసూళ్ల వర్షం కురిపించిన టాప్ 5 గ్రాస్ సినిమాలు ఏవో ఇప్పుడు వివరంగా చూద్దాం.
1) ఓజి (ఓఘ్) – రూ.302 కోట్లు
2025లో టాలీవుడ్ బాక్సాఫీస్‌ను ఏలిన చిత్రంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజి’ నిలిచింది. దర్శకుడు సుజిత్ తెరకెక్కించిన ఈ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలై, ఆ అంచనాలను పూర్తిగా నెరవేర్చింది. పవన్ కళ్యాణ్ స్టైల్, స్వాగ్, పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. యాక్షన్ సీన్స్, మాస్ ఎలివేషన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ఫలితంగా ‘ఓజి’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.302 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, 2025లో టాప్ గ్రాసింగ్ తెలుగు చిత్రంగా నిలిచింది. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ మరోసారి తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో నిరూపించాడు.
2) సంక్రాంతికి వస్తున్నాం – రూ.280 కోట్లు
2025 సంక్రాంతి కానుకగా విడుదలైన పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ రెండో స్థానాన్ని దక్కించుకుంది. దర్శకుడు అనిల్ రావిపూడి తనకు సొంతమైన కామెడీ టైమింగ్, ఎమోషన్, ఫ్యామిలీ సెంటిమెంట్‌ను ఈ చిత్రంలో మరోసారి విజయవంతంగా ప్రెజెంట్ చేశారు.విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించగా, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి కీలక పాత్రల్లో మెప్పించారు. కుటుంబ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ సినిమా థియేటర్లలో లాంగ్ రన్ సాగించింది. ఫలితంగా ఈ చిత్రం దాదాపు రూ.280 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి, 2025లో రెండో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది.
3) గేమ్ ఛేంజర్ – రూ.197 కోట్లు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సర్ప్రైజింగ్గా ఈ జాబితాలో మూడో స్థానాన్ని దక్కించుకుంది. దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ డ్రామా చిత్రం భారీ అంచనాలు, భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.197 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినప్పటికీ, పెట్టిన భారీ బడ్జెట్ దృష్ట్యా ఈ మూవీ డిజాస్టర్‌గా మిగిలింది. అయినప్పటికీ, వసూళ్ల పరంగా టాప్ 3లో చోటు దక్కించుకోవడం విశేషం.
4) మిరాయ్ – రూ.142 కోట్లు
యంగ్ హీరో తేజ సజ్జా నటించిన ‘మిరాయ్’ చిత్రం ఈ ఏడాది టాలీవుడ్‌కు పెద్ద సర్ప్రైజ్గా నిలిచింది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, కంటెంట్ పరంగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. థియేటర్లలో పాజిటివ్ టాక్‌తో ముందుకు సాగిన ‘మిరాయ్’ చిత్రం రూ.142 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది.
5) కుభేర – రూ.138 కోట్లు
టాప్ 5 జాబితాలో ఐదో స్థానాన్ని దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘కుభేర’ చిత్రం దక్కించుకుంది. అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా కంటెంట్ పరంగా ప్రేక్షకులను బాగా మెప్పించింది.
బలమైన కథ, సహజమైన నటన, ఎమోషనల్ డెప్త్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ఫలితంగా ‘కుభేర’ చిత్రం రూ.138 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, 2025లో టాప్ 5 గ్రాసింగ్ సినిమాల్లో చోటు సంపాదించింది.