నాని రిజెక్ట్ చేసిన కథతో శివ కార్తికేయన్ మూవీ... డైరెక్టర్ ఎవరు తెలుసా..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో నాని ఒకరు. నాని గత కొంతవ్కాలం క్రితం తమిళ దర్శకుడు అయినటువంటి సిబి చక్రవర్తి దర్శకత్వంలో మూవీ చేయబోతున్నట్లు , ఆల్మోస్ట్ వీరిద్దరి కాంబో లో మూవీ సెట్ అయినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ సినిమా జాడే లేకుండా పోయింది. నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న సరిపోదా శనివారం సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. అలాగే వేణు , సుజిత్ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నాడు.

ఇక దానితో సిబి చక్రవర్తి , నాని కాంబో మూవీ లేనట్లే అయిపోయింది. కానీ సిబి చక్రవర్తి మాత్రం నాని కి చెప్పిన కథతో వేరే దర్శకుడుతో మూవీ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... సిబి చక్రవర్తి , నాని కి ఓ కథ చెప్పగా , దానికి నాని పెద్దగా సాటిస్ఫై కానట్లు , అందుకే ఆ ప్రాజెక్టు ఓకే కానట్లు తెలుస్తోంది. ఇక ఆ కథ నాని కి నచ్చకపోవడంతో దానిని చక్రవర్తి , శివ కార్తికేయనుకు చెప్పాడట. ఆయనకు ఈ స్టోరీ సూపర్ గా నచ్చడంతో వీరి కంబో లో మూవీ సెట్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా కనిపించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇది ఇలా ఉంటే సిబి చక్రవర్తి "కాలేజ్ డాన్" అనే మూవీ తో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ లో శివ కార్తికేయన్ హీరో గా నటించగా ... ప్రియాంక అరుణ్ మోహన్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. గతంలోనే వీరి కాంబోలో కాలేజ్ డాన్ మూవీ వచ్చి సూపర్ సక్సెస్ కావడంతో వీరి కాంబో లో మరో మూవీ వస్తే దాని పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొనే అవకాశం చాలా వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: