రోహిత్ కోసం.. నేను ఏదైనా చేస్తా : ప్రీతీ జింటా

praveen
ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభమైన నాటి నుంచి కూడా ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ గా, ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్గా కొనసాగుతున్న రోహిత్ శర్మ గురించి ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంది. ముంబై ఇండియన్స్ జట్టుకు ఐదుసార్లు  ఐపీఎల్ టైటిల్ అందించిన రోహిత్ శర్మను ఆ జట్టు యాజమాన్యం అర్ధాంతరంగా సారధ్య బాధ్యతలు నుంచి తప్పించింది. హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ నిర్ణయంతో రోహిత్ అభిమానులు అందరూ కూడా తీవ్రంగా నిరాశలో మునిగిపోయారు.

 ఏకంగా రోహిత్ లాంటి కెప్టెన్ ను తొలగించిన తర్వాత ప్రస్తుతం అటు ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శనతో వరుస ఓటములతో సతమతమవుతుంది. ఇదిలా ఉంటే కెప్టెన్సీ నుంచి తప్పించిన నేపథ్యంలో రోహిత్ శర్మ అసంతృప్తితో ఉన్నాడని.. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది సీజన్ కి ముందు జరగబోయే ఐపీఎల్ మెగా వేలంలో ముంబై ఇండియన్స్ నుంచి బయటకు వచ్చి వేలంలో పాల్గొంటారని చర్చ జరుగుతుంది. అయితే ఒకవేళ ఇలా అతను వేలంలోకి వస్తే ఇక రోహిత్ శర్మను ఎంత ధర పెట్టి అయినా సరే కొనుగోలు చేసేందుకు మిగతా ఫ్రాంచైజీలు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి.

 ఇక ఇదే విషయం గురించి పంజాబ్ కింగ్స్ ఓనర్, బాలీవుడ్ నటి ప్రీతి జింటా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ ఐపిఎల్ మెగా వేలంలోకి వస్తే తాము కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం అంటూ చెప్పుకొచ్చారు. మా టీంకు స్థిరత్వం, చాంపియన్ మైండ్ సెట్ ఉన్న కెప్టెన్ కావాలి. అవన్నీ రోహిత్ శర్మ వద్ద ఉన్నాయి. అందుకే 2025 ఐపీఎల్ సీజన్ లో అతను మెగా వేలంలోకి వస్తే అతని కోసం ఎంత ఖర్చు చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నాం అంటూ ప్రీతి జింటా చెప్పుకొచ్చింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఇలాంటి వ్యాఖ్యలు చేసింది ఈ బాలీవుడ్ హీరోయిన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: