స్టార్ ప్లేయర్లకు బిగ్ షాక్.. ఒక్కరు కూడా అమ్ముడుపోలేదు?

praveen
ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్ లో మ్యాచ్లు జరిగితేనే క్రికెట్ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఉండేది. కానీ ఇప్పుడు అంతర్జాతీయ మ్యాచ్లను మించి ఎన్నో లీగులు అటు ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచుతున్నాయ్ అని చెప్పాలి. ఇప్పటికే అన్ని దేశాల క్రికెట్ బోర్డులు కూడా ఇక ఐపీఎల్ తరహాలో టి20 లీగ్ లు నిర్వహిస్తూ ఉన్నాయి. అయితే ఇక మరికొన్ని దేశాలు కేవలం టి20 లీగ్ లతో పాటు మరి కొన్ని ఫార్మట్లలో కూడా అటు టోర్నీలు జరుగుతూ ఉండడం గమనార్హం. అయితే ఐపీఎల్లో ఎలా అయితే విదేశీ ఆటగాళ్లు టోర్నీలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారో.. ఇక మిగతా టోర్నీలో కూడా ఇలాగే వేలంలో పాల్గొని అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు.

 అయితే ఇలా టోర్నికి సంబంధించిన వేలం జరిగినప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న వారిని కొనుగోలు చేసేందుకు అన్ని ఫ్రాంచైజీలు కూడా ఆసక్తిని కనబరుస్తూ ఉంటాయి. కానీ గత కొంతకాలం నుంచి ఫ్రాంచైజీల ఆలోచన తీరు పూర్తిగా మారిపోయిందేమో అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఒకప్పటిలా అనుభవం కలిగిన స్టార్ ప్లేయర్ల మీద ఎక్కువ మొత్తంలో ధర వెచ్చించడానికి ఫ్రాంచైజీలు ఆసక్తి కనపరచడం లేదు. అప్పుడప్పుడు అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెడుతున్న కొత్త ప్లేయర్లను కొనుగోలు చేస్తూ భవిష్యత్తు ప్రయోజనాలను చూసుకుంటున్నాయ్ అన్ని ఫ్రాంచైజీలు.

 దీంతో కొంతమంది స్టార్ ప్లేయర్లకు చివరికి వేలంలో ఊహించని షాక్ లు తగులుతున్నాయి. స్టార్ ప్లేయర్లు అయ్యుండి కూడా అన్ సోల్డ్ ప్లేయర్లుగానే మిగిలిపోతున్నారు అని చెప్పాలి. కాగా ప్రస్తుతం పొట్టి ఫార్మాట్ క్రికెట్లో అదరగొడుతున్న బాబర్, డేవిడ్ వార్నర్, జేసన్ రాయ్, టిమ్ డేవిడ్, మహమ్మద్ రిజ్వాన్లకు ఊహించని షాక్ తగిలింది. ఇంగ్లాండులో జరిగే ది 100 లీగ్ 2024 వేలంలో వీళ్ళని కొనుగోలు చేయడానికి ఏ జట్టు ముందుకు రాలేదు. దీంతో ప్రస్తుతం ఎంతో అనుభవం కలిగిన ఈ స్టార్ ప్లేయర్లు అమ్ముడుపోని ఆటగాళ్లు గానే మిగిలిపోయారు అని చెప్పాలి. దీంతో ఈ విషయం తెలిసి అభిమానులు అందరూ కూడా షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: