ప్లీజ్.. కింగ్ అని పిలవద్దు : కోహ్లీ

praveen
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందరిలాగానే ఒక సాదాసీదా ఆటగాడిగా భారత జట్టులోకి అడుగుపెట్టిన విరాట్ కోహ్లీ.. అతి తక్కువ సమయంలోనే స్టార్ ప్లేయర్గా ఎదిగాడు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టీమ్ ఇండియాకు ఫ్యూచర్ స్టార్ట్ అన్న విషయాన్ని భారత క్రికెట్ ప్రేక్షకులకు అర్థమయ్యేలా చేశాడు. మూడు ఫార్మాట్లలో  కూడా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూ వచ్చాడు విరాట్ కోహ్లీ. ఇక ఎంతోమంది లెజెండరీ ప్లేయర్స్ సాధించిన రికార్డులను అలవోకగా బద్దలు కొట్టి తన పేరును లికించుకున్నాడు అని చెప్పాలి.

 అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టి దాదాపు దశాబ్దంగా కాలం దగ్గర పడుతున్న.. ఇంకా జట్టులోకి కొత్తగా వచ్చిన ఆటగాడిలాగానే ఏదో నిరూపించుకోవాలి అనే కసి విరాట్ కోహ్లీలో కనిపిస్తూ ఉంటుంది. ఇక ఇప్పటికి రికార్డులు వేట కొనసాగిస్తూనే ఉన్నాడు అని చెప్పాలి. అందుకే అటు అభిమానులు అందరూ కూడా విరాట్ కోహ్లీని ఎన్నో ముద్దు పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు. కొంతమంది రన్ మిషిన్ అని కొంతమంది రికార్డులు రారాజు అని పిలుస్తారు. ఇక ఎక్కువ మంది క్రికెట్ ప్రేక్షకులు మాత్రం కింగ్ కోహ్లీ అని పిలుస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కింగ్ అని పిలవడం గురించి ఇటీవలే విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 ఇటీవలే ఆర్సిబి అన్ బాక్స్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఈవెంట్లో విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ కార్యక్రమంలో కింగ్ కోహ్లీ అనుభూతి ఎలా ఉంది అని యాంకర్ అడగగా.. ప్రేక్షకులు ఒక్కసారిగా కోహ్లీ అంటూ నినాదాలు చేశారు. తర్వాత కోహ్లీ మాట్లాడుతూ ఫ్యాన్స్ మీరంతా ప్రశాంతంగా ఉండండి.. మేము త్వరగా చెన్నైకి వెళ్ళాలి అని చెప్పాడు. ఇక యాంకర్ ను ఉద్దేశిస్తూ మీరు నన్ను కింగ్ అని పిలవద్దు. విరాట్ అని పిలవండి చాలు అంటూ తెలిపాడు. కింగ్ అని పిలిస్తే తనకు ఇబ్బందిగా ఉంటుంది కోహ్లీ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: