ఐపీఎల్ : ఆటగాళ్ల పాస్ పోర్టులు తీసుకుంటున్న జట్టు యాజమాన్యాలు?

praveen
బిసిసిఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా ఐపిఎల్ నిర్వహిస్తూ ఉంటుంది. అయితే ఇక ఎప్పుడూ ఇండియా వేదికగానే ఐపిఎల్ టోర్నీ జరుగుతుంది. కానీ గతంలో కరోనా వైరస్ ప్రభావం దృశ్య యూఏఈ వేదికగా ఇక ఈ టోర్నీ జరిగింది అన్న విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం కరోనా పరిస్థితులు సద్దుమనగడంతో ఇండియాలోనే ఈ టోర్నీ జరుగుతూ వస్తుంది. అయితే ఇక ఇప్పుడు 2024 ఐపీఎల్ తోనే నిర్వహణ విషయంలో మాత్రం గందరగోల పరిస్థితులు నెలకొన్నాయి అని చెప్పాలి. ఎందుకంటే ఐపీఎల్ టోర్ని నిర్వహించే సమయానికి అటు పార్లమెంటు ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. దీంతో ఇక ఈ టోర్ని ఈసారి యూఏఈ వేదికగా నిర్వహించే అవకాశం ఉంది అని అందరూ అభిప్రాయం వ్యక్తం చేశారు.

 కానీ అంతలోనే అటు బీసీసీఐ ఐపీఎల్ కు సంబంధించిన షెడ్యూల్ ని విడుదల చేయడంతో.. ఇక ఈసారి ఇండియాలోనే ఐపిఎల్ నిర్వహిస్తారు అనే విషయంపై ఒక క్లారిటీ వచ్చింది. అయితే అటు బీసీసీఐ కేవలం ఐపిఎల్ మొదటి పేస్ షెడ్యూల్ మాత్రమే విడుదల చేసింది. పార్లమెంట్ ఎలక్షన్స్ కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైన తర్వాత రెండో ఫేస్  షెడ్యూల్ ని విడుదల చేస్తాము అంటూ ప్రకటించింది. దీంతో ఇక ఇటీవల పార్లమెంటు ఎలక్షన్స్ కు సంబంధించిన షెడ్యూల్ విడుదల కాగా ఒక ఇక రెండో పేస్ ఐపీఎల్ ను అటు యూఏఈకి తరలిస్తారు అంటూ ప్రచారం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయ్ అన్నది తెలుస్తుంది.

 ఇలా ఎలక్షన్స్ దృష్ట్యా ఐపీఎల్ రెండో దశ మ్యాచ్లను దుబాయ్ లో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నా నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అన్ని జట్ల యాజమాన్యాలు తమ ఆటగాళ్ల పాస్పోర్ట్ లను  తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఆఖరి నిమిషంలో ఏమైనా మార్పులు ఉంటే ఈ చర్య ఉపయోగపడుతుందని ఇక జట్ల యాజమాన్యాలు భావిస్తున్నాయట. అయితే ఐపీఎల్ రెండవ దశను కూడా అటు ఇండియాలోనే నిర్వహిస్తాము అంటూ ఇప్పటికే బీసీసీఐ సెక్రెటరీ జైషా స్పష్టం చేశారు  కానీ చివరి నిమిషం వరకు కూడా ఏదైనా మార్పులు జరిగే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: