ఓడితే సంబరాలు చేసుకుంటున్నారేంటి.. ఐపీఎల్ లో ఏం జరుగుతుందో ?

praveen
ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ విషయంలో దారుణంగా వ్యవహరించింది. ఏకంగా అతనికి అన్యాయం చేసింది అంటూ గత కొంతకాలం నుంచి సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే అప్పటివరకు ఐపీఎల్ హిస్టరీలో ఒక్కసారి కూడా టైటిల్ విజేతగా నిలవని టీం గా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ రోహిత్ తన కెప్టెన్సీలో ఏకంగా ఐదు సార్లు టైటిల్ విజేతగా నిలిచాడు. అంతేకాదు మోస్ట్ సక్సెస్ఫుల్ టీం గా కూడా జట్టును నిలపడంలో సక్సెస్ అయ్యాడు అని చెప్పాలి. ఇక తన కెప్టెన్సీకి తిరుగులేదు అని నిరూపించాడు.

 ఈ క్రమంలోనే రోహిత్ కెప్టెన్సీ మ్యాజిక్ చూసిన తర్వాత తమకు కూడా ఇలాంటి కెప్టెన్ దొరికితే ఎంత బాగుండు అని మిగతా టీమ్స్ అన్నీ కూడా కుళ్లుకునే విధంగా రోహిత్ సారధ్య ప్రస్థానం కొనసాగుతుంది. అలాంటి రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం కనీస గౌరవం ఇవ్వకుండా అర్ధాంతరంగా కెప్టెన్సీ నుంచి తొలగించింది అన్న విషయం తెలిసిందే. ఏకంగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా ఉన్న హార్దిక్ పాండ్యాను ఏరి కోరి మరియు జట్టులోకి తెచ్చుకుని అతని చేతిలో సారధ్య బాధ్యతలను  పెట్టింది. దీంతో ఈ విషయాన్ని రోహిత్ శర్మ అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఇప్పటికే ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా ఖాతాలను కూడా రోహిత్ అభిమానులు అన్ ఫాలో చేశారు అన్న విషయం తెలిసిందే.

 ఇక ముంబై ఇండియన్స్ ఓడిపోవాలని కోరుకుంటున్న అభిమానుల సంఖ్య కూడా పెరిగిపోయింది  అయితే ఇటీవల ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా జరిగిన సెమీఫైనల్ లో బెంగళూరు చేతిలో ముంబై ఇండియన్స్ ఉమెన్స్ జట్టు ఓడిపోయింది అన్న విషయం తెలిసిందే. దీంతో రోహిత్ శర్మ ఫ్యాన్స్ అందరు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించిన ముంబైకి సరైన గుణపాఠం తగిలింది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. శర్మ.. కర్మ అంటూ హ్యాష్ ట్యాగ్లను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కాగా 2012 వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ముంబై ఇండియన్స్ కు 2013లో కెప్టెన్సీ చేపట్టిన తర్వాత ఐదుసార్లు టైటిల్ అందించాడు రోహిత్ శర్మ. అయితే ఐపీఎల్లో ముంబై ఓడిన రోహిత్ అభిమానులు ఇలాగే సెలబ్రేట్ చేసుకునే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: