చరిత్ర సృష్టించిన ఐర్లాండ్ ప్లేయర్.. కోహ్లీ, రోహిత్ లకు సాధ్యం కాని రికార్డు?

praveen
టి20 ఫార్మాట్ అంటేనే బ్యాట్స్మెన్ ల విద్వాంసానికి మారుపేరు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే అతి తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయాలి అని ఒత్తిడి అటు ప్రతి బ్యాట్స్మెన్ పైన కూడా ఉంటుంది. ఈ క్రమంలోనే క్రీజ్ లోకి వచ్చిన ఆటగాడు ఇక కొన్ని బంతులు ఎదుర్కొని.. క్రీజూలో కుదురుకోవడానికి ఎక్కడ ప్రయత్నించటం కాదు.. ఇక రావడం రావడమే సిక్సర్లు ఫోర్ లతో చెలరేగిపోవాలి అనే మైండ్ సెట్ తో ఇక బ్యాట్ జులిపిస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ఇలా దూకుడుగా ఆడి విధ్వంసం సృష్టించాలి అనే మైండ్ సెట్ తో క్రీజులోకి వచ్చిన ఆటగాడిని కంట్రోల్ చేయడం అటు బౌలర్లకు కూడా పెద్ద సవాలు లాంటిది అని చెప్పాలి.

 అయితే మిగతా ఫార్మాట్లలో సింగిల్స్ తీయడం ద్వారా ఎక్కువగా పరుగులు రాబడితే.. అటు టి20 ఫార్మాట్లో మాత్రం బౌండరీలు సిక్సర్లు బాదటం ద్వారానే ప్రతి ఒక్క ఆటగాడు కూడా ఎక్కువ పరుగులు రాబట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎంతో మంది స్టార్ ప్లేయర్లు అటు టి20 ఫార్మాట్లో బౌండరీలు బాదటం లేదంటే సిక్సర్లు కొట్టడం విషయంలో రికార్డులు సృష్టిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే t20 ఫార్మాట్లో ఇలా ఒక అరుదైన రికార్డు క్రియేట్ అయింది అంటే అత్యుత్తమ ఆటగాల్లైన బాబర్, కోహ్లీ, రోహిత్, డేవిడ్ వార్నర్ లాంటివాళ్లే ఈ రికార్డు సృష్టించి ఉంటారు అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఇక ఈ స్టార్ ప్లేయర్లకు సాధ్యం.. కానీ ఒక అరుదైన రికార్డును ఒక పసికూన జట్టు ప్లేయర్ సృష్టించాడు.

 అంతర్జాతీయ టి20 క్రికెట్లో ఏకంగా 400 ఫోర్లు బాదిన తొలి బ్యాట్స్మెన్ గా ఐర్లాండ్ ఆటగాడు పాల్ స్టీరింగ్ రికార్డు సృష్టించాడు. అత్యధిక ఫోర్లు కొట్టిన ప్లేయర్ల లిస్టులో అతను 401 ఫోర్ లతో టాప్ లో ఉన్నాడు. ఆ తర్వాత స్థానాలలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజం 395, విరాట్ కోహ్లీ 361, రోహిత్ శర్మ 359, డేవిడ్ వార్నర్ 324లతో ఉన్నారు అని చెప్పాలి. ఇలా అంతర్జాతీయ క్రికెట్లో లెజెండ్స్ గా కొనసాగుతున్న ప్లేయర్లకు సైతం సాధ్యం కాని రికార్డును ఒక పసికూన టీం జట్టు ఆటగాడు సృష్టించడం సంచలనంగా మారిపోయింది. ఇక సిక్సర్ల విషయానికి వస్తే టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ 190 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: