కెప్టెన్ రోహిత్.. లగాన్ సినిమాలో అమీర్ లాంటివాడు : సర్ఫారాజ్

praveen
భారత జట్టులో స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ ప్రస్తుతం టీమిండియాకు మూడు ఫార్మట్లలో కూడా కెప్టెన్ గా కొనసాగుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక తన సారథ్యంతో ఎంతో విజయవంతంగా జట్టును ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అయితే ఇక రోహిత్ శర్మ కెప్టెన్సీ వ్యూహాలపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు ఎప్పుడు ప్రశంసలు కురిపిస్తూ ఉంటాడు. ఇక అతని సారథ్యంలోనే ప్రస్తుతం భారత జట్టు మూడు ఫార్మాట్లలో కూడా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతూ ఉంది అన్న విషయం తెలుస్తుంది.

 అయితే భారత జట్టులోకి అరంగేట్రం చేసిన యువ ఆటగాళ్లు కూడా కెప్టెన్ రోహిత్ నుంచి ఎంతో మద్దతు లభించిందని.. ఇక ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో అటు రోహిత్ శర్మ ఎప్పుడు ముందుంటాడు అంటూ ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల సర్పరాజ్ ఖాన్ సైతం కెప్టెన్ రోహిత్ శర్మ పై ప్రశంసలు కురిపించాడు. ఎన్నో రోజులుగా భారత జట్టులో ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న సర్పరాజ్ ఖాన్ ఇటీవలే ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టులోకి అరంగేట్రం చేసేందుకు అవకాశం దక్కించుకున్నాడు. ఇక ఇలా వచ్చిన అవకాశాన్ని మంచి ప్రదర్శిని చేసి సద్వినియోగం చేసుకున్నాడు.

 ఈ క్రమంలోనే ఇటీవలే రోహిత్ కెప్టెన్సీ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ లగాన్ సినిమాలో అమీర్ ఖాన్ లాంటివాడు అంటూ సర్ఫరాజ్ ఖాన్ అన్నాడు. రోహిత్ భయ్యా తో కలిసి ఉండడాన్ని ఎంతగానో ఎంజాయ్ చేశాను. ఆయన ప్రతి ఆటగాడికి మద్దతు ఇస్తాడు  చాలా మంచి మనిషి. ప్రతి ఆటగాడి ప్రట్ల శ్రద్ధ వహిస్తాడు. రోహిత్ భాయ్ టీం ని బిల్డ్ చేసే విధానం చూస్తే ఏకంగా లగాన్ సినిమాలో అమీర్ ఖాన్ గుర్తుకు వస్తాడు అంటూ సర్ఫరాజ్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కాగా అటు ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ లో వరుస హాఫ్ సెంచరీలతో అదరగొట్టాడు ఈ యువ ఆటగాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: