ధోని కన్ను పడింది.. శ్రీలంక కెప్టెన్ కు లక్కీ ఛాన్స్?

praveen
ఇండియాలో మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోయే క్రికెట్ పండుగ గురించి అటు భారత క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారూ అన్న విషయం తెలిసిందే. అయితే బీసీసీఐ ఇప్పటికే ఐపీఎల్ 2024 సీజన్ కు సంబంధించి షెడ్యూల్ను కూడా విడుదల చేసింది. మార్చి 22వ తేదీ నుంచి ఐపీఎల్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఐపీఎల్ ప్రారంభానికి కొన్ని రోజుల సమయం ఉన్న నేపథ్యంలో అన్ని టీమ్స్ కూడా టైటిల్ గెలవడమే లక్ష్యంగా పక్కా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయ్. కాగా మొదటి మ్యాచ్ లో భాగంగా అటు బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి.

 అయితే ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు అన్ని టీమ్స్ అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటూ ఉండగా.. కొన్ని టీమ్స్ కి మాత్రం ఐపీఎల్ ప్రారంభానికి ముందే ఊహించని ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఏకంగా జట్టులో కీలక ప్లేయర్లుగా కొనసాగుతున్న వారు చివరికి గాయం బారిన పడి జట్టుకు దూరమవుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ కి ఇలాంటి ఎదురు దెబ్బలు తగిలాయి. ఏకంగా జట్టులో ఉన్న కీలక ఆటగాళ్లు ఇక గాయం బారిన పడి చివరికి ఐపీఎల్ టోర్నీ మొత్తానికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది.

 ఇలా చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ డేవాన్ కాన్వే సైతం గాయంతో ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అతని స్థానాన్ని మరో ఆటగాడితో భర్తి చేసేందుకు సిద్ధమైంది చెన్నై జట్టు యాజమాన్యం. ఈ క్రమంలోనే శ్రీలంక కెప్టెన్ కుషాల్ మొండిస్ ను ఇక జట్టులోకి తీసుకునేందుకు సిద్ధమైందట. డేవాన్ కాన్వే గాయంతో దూరం కావడంతో ఇక అతని స్థానంలో మొండిస్ కు అవకాశం ఇవ్వడానికి చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణయం తీసుకుంది అని టాక్. కాగా 2024 ఐపీఎల్ మినీ వేలంలో కుషాల్ మొండిస్ అన్ సోల్డ్ ప్లేయర్గా మిగిలిపోయాడు అన్న విషయం తెలిసిందే. 50 లక్షల బేస్ ప్రైస్ తో వేలంలో పాల్గొన్నప్పటికీ ఏ ఫ్రాంచైజీ అతన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: