ఐపీఎల్ హిస్టరీలో.. ఢిల్లీ ప్లేయర్ అరుదైన రికార్డ్?

praveen
2024 ఐపీఎల్ సీజన్ వీర విధ్వంసం అనే పదానికి కేరాఫ్ అడ్రస్ గా కొనసాగుతుంది. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇక ఈసారి బ్యాట్స్మెన్ల హవా కొనసాగుతుంది అని చెప్పాలి  ఇక మొదటి బంతి నుంచే సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోవాలి అనే మైండ్ సెట్ తో బరిలోకి దిగిన బ్యాట్స్మెన్లు ప్రతి మ్యాచ్ లో కూడా ఇది ఆచరణలో పెడుతున్నారు. దీంతో బ్యాట్స్మెన్లు వీర బాదుడు బాదుతూ కొట్టే సిక్సర్లు చూస్తూ అలా ప్రేక్షకుల ఉండిపోవడం అటు బౌలర్ల వంతు అవుతుంది.

 ఇక ప్రతి మ్యాచ్ లో కూడా ఇలా బ్యాట్స్మెన్ల విధ్వంసం నేపథ్యంలో.. ఇక భారీ స్కోర్ నమోదు అవుతూ ఉండడం గమనార్హం. దీంతో ఇప్పటివరకు ఐపీఎల్ హిస్టరీ లో ఉన్న ఎన్నో అరుదైన రికార్డులు సైతం తుడిచిపెట్టుకుపోతున్నాయి అని చెప్పాలి. అయితే కేవలం మొదట బ్యాటింగ్ చేసిన జట్టే భారీగా స్కోర్ చేసింది అనుకుంటే ఆ తర్వాత లక్ష్య చేదనకు  దిగిన టీం సైతం ఇక భారీ టార్గెట్లను ఎంతో అలవోకగా చేదిస్తూ ఉండడం నేటి ఐపిఎల్ లో కనిపిస్తుంది. ఇక రానున్న టి20 వరల్డ్ కప్ లో కూడా ఇలాంటి బ్యాటింగ్ విధ్వంసం చూసే అవకాశం ఉందని క్రికెట్ విశేషకులు కూడా అంచనా వేస్తున్నారు.

 ఇకపోతే ఐపిఎల్ టోర్నీలో ఇప్పటివరకు ఎంతోమంది ఆటగాళ్లు అరుదైన రికార్డులు సృష్టించారు. కాగా ఇటీవల ఢిల్లీ, ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఢిల్లీ విధ్వంసకర ఓపెనర్ ప్రెజర్ మేగ్ గుర్క్ ఐపీఎల్ లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు  ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ముంబై తో జరుగుతున్న మ్యాచ్లో మెగ్ గుర్క్  15 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించాడు. అతని తర్వాత స్థానంలో క్రిస్ మోరిస్ 17 బంతుల్లో రిషబ్ పంత్ 18 బంతులు, పృద్విష 18 బంతులు, స్టబ్స్ 19 బంతులతో హాఫ్ సెంచరీ  సాధించిన ప్లేయర్లుగా ఉన్నారు. కాగా ముంబై పై విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పాయింట్ల పట్టికలో ఐదవ స్థానానికి దూసుకుపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: