బీసీసీఐ ఇప్పటికైనా.. హార్దిక్ ను అలా చూడటం మానాలి : భారత మాజీ

praveen
ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి కూడా టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న హార్దిక్ పాండ్యా తీరు సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోతోంది అన్న విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ మొదలవ్వకముందు నుంచి అతను వార్తల్లో నిలుస్తున్నాడు. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ కు ముంబై ఇండియన్స్ సారధిగా బాధ్యతలు అప్పగించడంతో ఫ్యాన్స్ అందరు కూడా బాగా హర్ట్ అయ్యారు. దీంతో హార్దిక్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేసారు. అయితే ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత అతను కెప్టెన్ గా సక్సెస్ అయివుంటేనైనా ఈ విమర్శలు తగ్గేవేమో.

 కానీ అలా జరగలేదు. ఏకంగా ఐపీఎల్లో ఛాంపియన్ టీం అయిన ముంబై ఇండియన్స్ కు కెప్టెన్ గా ఉన్న హార్దిక్ ఎక్కడ సక్సెస్ కాలేకపోతున్నాడు. ఇక కేవలం కెప్టెన్ గా మాత్రమే కాదు వ్యక్తిగత ప్రదర్శన విషయంలో కూడా హార్దిక్ అభిమానులను నిరాశ పరుస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇప్పటివరకు 9 మ్యాచ్ లు ఆడిన ముంబై ఇండియన్స్ జట్టు కేవలం 3 విజయాలు మాత్రమే సాధించి పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండవ స్థానంలో కొనసాగుతోంది. ఇక ఆ జట్టు ఆట తీరుపై విమర్శలు కూడా వస్తున్నాయి అని చెప్పాలి  అయితే హార్దిక్ బ్యాటింగ్లో అప్పుడే కాస్త పర్వాలేదు అనిపిస్తున్న ఇక బౌలింగ్ జోలికి మాత్రం ఎక్కువగా పోవట్లేదు.

 దీంతో ఇలాంటి ఆల్ రౌండర్ కి టి20 వరల్డ్ కప్ జట్టులో చోటు కల్పిస్తే అది టీమిండియాకు మైనస్ గా మారుతుందని ఎంతో మంది మాజీ ప్లేయర్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు  ఇక ఇదే విషయం గురించి భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. హార్థిక్ పాండ్యాను ఒక సూపర్ స్టార్ లాగా చూడటం బిసిసిఐ మానుకోవాలి అంటూ హితవు పలికాడు. క్రమం తప్పకుండా చక్కని ప్రదర్శన ఇస్తే తప్ప అతడిని కీలక ఆటగాడుగా పరిగణించవద్దు అంటూ తేల్చి చెప్పాడు.  నువ్వు అద్భుతమైన ఆల్ రౌండర్ అని భావిస్తే అంతర్జాతీయ స్థాయిలో నీ ప్రదర్శన కూడా ఆ స్థాయిలోనే ఉండాలి హారతిక్ విషయంలో తనకున్న నైపుణ్యం పై చర్చే తప్ప ప్రదర్శన మాత్రం ఎక్కడా కనిపించట్లేదు అంటూ విమర్శలకు పెంచాడు ఇర్ఫాన్ పడ్డాను

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: