ఏపీ: గెలిచేది ఆ పార్టీనే.. ప్రకంపనలు సృష్టిస్తున్న తాజా సర్వే..!!

Divya
ఎలక్షన్ సమయం దగ్గర పడుతున్న కొద్ది చాలామంది నేతలు టెన్షన్ కూడా మొదలవుతుంది.. ముఖ్యంగా పలు రకాల సర్వేలు కూడా ఇదే అదునుగా చేసుకొని పలు సర్వేలను కూడా విడుదల చేస్తూ ఉంటాయి.. ఇందులో కొన్ని సర్వేలు ఏ ఏ పార్టీలకు అనుకూలంగా వస్తే ఆ పార్టీలు సంతోషంగా ఉంటారు.. అవతల వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చినప్పుడు వాళ్లు చిరాకు పడుతూ ఉంటారు.. రోజుకొక కొత్త సర్వేలు పుట్టగొడుగుల పుట్టుకొస్తున్నాయి.. అవి వాటి యొక్క విశ్వసనీయతను జనాలు ప్రశ్నించారు.. ఎవరికి వాళ్లు చేసుకుంటూ ఉంటారు. అది ఫేక్ లేకపోతే పెయిడ్ సర్వే ఇలా నాన రకాలుగా తెలియజేస్తూ ఉంటారు.

ఎలక్షన్ అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా వాటిని బేస్ చేసుకుని చాలామంది రాసుకుంటూ ఉంటారు. జాతీయ చానల్లో కూడా తేడాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఒక కొత్త సర్వే 360 అనే పేరుతో ఒక సర్వేను నిర్వహించిందట. వీళ్లు మళ్ళీ విచిత్రమైనటువంటి సర్వే చేశారు. వైయస్సార్సీపి పార్టీకి ఏకంగా 58%.. గతంలోని 50% వచ్చింది..ఎన్డీఏకు కేవలం 38 శాతమట.. గతంలో టిడిపికి ఒక్కటే 40 శాతం వరకు వచ్చింది.. ఇతరులకు ఒక శాతం అన్నట్టుగా చూపించారు. సీట్ల పరంగా చూసుకుంటే.. 132 నుంచి 139..
కూటమి విషయానికి వస్తే.. 42 నుంచి 49 సీట్లు వస్తాయని ఇతరులకు ఒకటి నుంచి రెండు.. అని తెలియజేస్తున్నారు. గ్రౌండ్ లెవెల్ రిపోర్టు అని తెలియజేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ..ఇప్పుడు ఈ సర్వే వైరల్ గా మారుతోంది. అయితే ఈ సర్వే నమ్మదగ్గదా అంటే కొంతమందికి ఇది నమ్మేలా కనిపించడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే వైసిపి పార్టీ మేనిఫెస్టో కూడా విడుదల చేయడం జరిగింది.. అయితే ఇందులో కూడా కేవలం కొన్ని పథకాలకు మాత్రమే డబ్బులను పెంచారు. అందరూ అనుకున్నట్టుగా డాక్రామాఫీ, రుణమాఫీ వంటి ప్రస్తావన ఎక్కడ జగన్మోహన్ రెడ్డి తీసుకురాలేదు. మరి ఇలాంటి సమయంలో అంత శాతం ఓటింగ్ వస్తుందా..? అనేది ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: