అమ‌రావ‌తిలో కూట‌మిది అత‌కుల బొంతే... క‌ల‌వ‌ని చేతులు.. మ‌న‌సులు..?

Pulgam Srinivas
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు గారు కృష్ణ గుంటూరులకు దగ్గరలో అమరావతి అనే పట్టణాన్ని రాజధానిగా ఎంపిక చేసుకున్నారు. అందుకోసం కొన్ని భూములను కూడా రైతుల దగ్గర నుండి తీసుకొని ఎన్నో ప్రభుత్వ భవనాలను నిర్మించాడు. ఇక చంద్రబాబు గవర్నమెంట్ పోయి వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి రాగానే మూడు రాజధానుల ప్రస్తావన తెరపైకి వచ్చింది.

దానితో అమరావతి రాజధాని అవుతుంది అని భూములు ఇచ్చిన రైతులు వైసీపీ పైకి గుర్రగా చూడడం మొదలుపెట్టారు. 
ఇక దానితో ఈ అంశం కలిసి వస్తోంది కృష్ణ, గుంటూరు జిల్లాలలో భారీ ఎమ్మెల్యే సీట్లను దక్కించుకోవచ్చు అని మొదటి నుండి టీడీపీ అంచనా వేస్తూ వస్తుంది. ఆ అంచనాలకు మరింత బలం చేకూర్చేలా వైసీపీ రాబోయే ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేస్తూ ఉంటే టీడీపీ మాత్రం జనసేన, బీజేపీ లతో కలిసి పొత్తులో బాగంగా పోటీలోకి దిగింది. దానితో మరింతగా మా బలం పెరిగింది అని వీరు అంచనా వేసుకున్నారు.

కాకపోతే అక్కడే సీన్ రివర్స్ అయ్యింది. సీట్ల పంపిణీ విషయంలో మూడు పార్టీలకు సఖ్యత కుదరకపోవడం, ఆ తర్వాత పార్టీలు ఓకే అయిన నేతలకు, కార్యకర్తలు ఒక తాటిపైకి రాకపోవడంతో ఈ ప్రాంతాల్లో కూటమికి మైనస్ అయ్యింది. ఆ తర్వాత అటుపడి, ఇటుపడి టికెట్లను అడ్జస్ట్ చేసినప్పటికీ కొంతమంది బలమైన నేతలు వేరే పార్టీలోకి వెళ్లిపోవడం, ఉన్నవారు కూడా ప్రస్తుతం పోటీలో ఉన్న వారికి పెద్దగా సపోర్ట్ చేయకపోవడంతో అమరావతి చుట్టు పక్కల ప్లస్ అవుతుంది అనుకున్న టీడీపీ కి ఇది పెద్ద మైనస్ అయింది.

ఇక టీడీపీ నుండి టికెట్ వస్తుంది అనుకున్నా ప్రాంతాల్లో జనసేన లేదా బిజెపికి టికెట్ ఇవ్వడంతో వెంటనే వెళ్లి ఆ పార్టీ కండువా కప్పుకొని టికెట్లు పొందిన వారు కూడా అనేక మంది ఉన్నారు. దానితో అమరావతి ప్రాంతంలో కూటమిది అతుకుల బొంత పరిస్థితి అయిపోయింది. ఇలా టిడిపి, జనసేన,  బిజెపి అభ్యర్థులు ఎవరో అనేది తెలియక జనాలు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. దీని ద్వారా వీరికి రాబోయే ఎలక్షన్లలో అతి పెద్ద దెబ్బ అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: