వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు రెడీ అయిన "ది ఫ్యామిలీ స్టార్"..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు. ఈయన సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న ఈ మధ్య కాలంలో ఆ స్థాయి విజయాలను అందుకోవడంలో మాత్రం పూర్తి గా వెనకబడిపోయాడు. ఆఖరుగా గీత గోవిందం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈయన ఆ తర్వాత వరుసగా అపజయాలను ఎదుర్కొంటూ వస్తున్నాడు.

ఈ నటుడు కొంత కాలం క్రితం ది ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ లో మృణాల ఠాకూర్ హీరోయిన్ గా నటించగా ... పరుశురామ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ కి గోపి సుందర్ సంగీతం అందించాడు. ఇకపోతే ఇది వరకే విజయ్ , పరశురామ్ కాంబో లో గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ మూవీ రావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. కాకపోతే ఈ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

ఆ తర్వాత ఈ మూవీ ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ మూవీ ఓ టి టి ప్రేక్షకులను మాత్రం బాగానే ఆకట్టుకుంది. ఇలా థియేటర్ ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయ్యి ఓ టీ టీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్న ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెరపై ప్రసారం కానుంది. ఈ సినిమా యొక్క శాటిలైట్ హక్కులను స్టార్ మా సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమాను త్వరలోనే స్టార్ మా చానల్లో ప్రసారం చేయనున్నట్లు ఈ సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు. మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమా ఏ తేదీన బుల్లి తెరపై ప్రచారం కాబోతుందో అనే విషయాన్ని కూడా ఈ సంస్థ వారు ప్రకటించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

vd

సంబంధిత వార్తలు: