గెలుపు మాధవిలతదేనా.. మారుతున్న సమీకరణాలు?

praveen
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. అయితే ఇక దేశంలోని కొన్ని పార్లమెంట్ స్థానాలలో మాత్రం గెలుపు ఎవరిది అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. అచ్చం ఇలాగే అటు హైదరాబాద్ స్థానంలో ఈసారి ఎవరు గెలవబోతున్నారు అనేదానిపై కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా ఉత్కంఠ నెలకొంది అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు వరకు ఎంతో మంది రాజకీయ ఉద్దండులు వివిధ పార్టీల నుంచి ఇక్కడ పోటీ చేశారు. కానీ ఓవైసీని ఓడించిన వారు మాత్రం ఎవరూ లేరు. కానీ ఇప్పుడు బీజేపీ నుంచి బరిలోకి దిగిన మాధవి లత ఓవైసీని ఓడించబోతున్నారా అంటే మాత్రం అవుననే సమాధానమే వినిపిస్తుంది.

 మజిలీస్ పార్టీ కంచుకోటలో ముమ్మరంగా ప్రచార నిర్వహిస్తున్న మాధవి లత పదునైన ప్రసంగాలతో ప్రజలను ఆకర్షించడంలో సక్సెస్ అవుతున్నారు. అంతేకాదు తనను ఎంపీగా గెలిపిస్తే ఏం చేస్తాము అనే విషయంపై స్పష్టమైన హామీలను కూడా ఇస్తున్నారు. ఇక ఇప్పటివరకు ఎంపిగా గెలుస్తూ వచ్చిన ఓవైసీ ఇచ్చి మరిచిన హామీలను కూడా ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే మాధవి లత హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో గెలుస్తుందా అనే స్థాయి నుంచి తప్పకుండా గెలిచేస్తుంది అనే నమ్మకం అందరిలో పెరిగిపోయింది అని చెప్పాలి.

 ఇటీవల హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లోని ఐదు లక్షల 40 వేల దొంగ ఓట్లను తొలగించడం సంచలనంగా మారింది. అయితే ఈ విషయంపై ఓవైసీ ఎక్కడ స్పందించకపోవడం మరింత చర్చనీయాంశంగా మారింది. ఇక మాధవి లత ప్రచారం చూసి ఓవైసీ ఎన్నడూ లేనివిధంగా తెలుగు పాటలతో హిందూ ప్రజలు ఉండే ప్రాంతాల్లో ప్రచార నిర్వహించడం.. మరోవైపు ఎప్పుడు లేని విధంగా కాషాయ తలపాగా ధరిస్తు ప్రచార నిర్వహిస్తున్నారు ఓవైసీ. దీనిబట్టి ఆయనలో ఓటమి భయం పట్టుకుంది అని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. ఇక ఓవైసీ పై వ్యతిరేకత ఉన్న వాళ్ళందరూ కూడా మాధవి లతకు మద్దతు నిలిచేందుకు రెడీ అవ్వడం.. ఇంకోవైపు ఇక ఈ పార్లమెంట్ సెగ్మెంట్లోని మహిళా ఓటర్లు అందరూ కూడా మాధవి లతకు అనుకూలంగానే ఉన్నారు. వారి ఓట్లు పడిన ఆమె గెలిచే అవకాశం ఉంది. ఇంకోవైపు దొంగ ఓట్లు పడకుండా బూత్ పోలింగ్ మేనేజ్మెంట్ పకడ్బందీగా నిర్వహించే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇక ఓవైసీ మొదటిసారి ఓటమి చవిచూసే ఛాన్సులు ఉన్నాయని ప్రచారం కూడా జరుగుతుంది. మరి ఏం జరుగుతుందని చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: