షాకింగ్‌: పవన్‌ను దెబ్బ కొట్టేలా బాబు రహస్య వ్యూహం?

Chakravarthi Kalyan
ఏపీలో గాజు గ్లాస్ గుర్తు కూటమికి తెచ్చిన తలనొప్పి అంతా ఇంతా కాదు. ఈ ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తు కలిగి ఉన్న జనసేన కేవలం 21 స్థానాల్లోనే పోటీ చేస్తోంది. అయితే ఈ గుర్తును ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్ గా ప్రకటించడంతోనే వచ్చింది అసలు చిక్కంతా. చాలా చోట్ల ఇండిపెండెట్లు, నవతరం పార్టీ అభ్యర్థులు ఈ గుర్తును ఎంపిక చేసుకున్నారు.

జనసేన అభ్యర్థుల పోటీ చేస్తున్న స్థానాలు మినహా అన్ని చోట్ల గాజు గ్లాసును ఈసీ ఫ్రీ సింబల్ గా ప్రకటించడంతో కూటమిలో అలజడి రేగింది. అయితే ఇప్పుడు దీని వెనుక చంద్రబాబు ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎలా అంటే.. మొత్తం 52 మంది అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. ఈ గుర్తు కోసం నవతరం పార్టీ కూడా గట్టిగానే ప్రయత్నించింది.

దీంతో ఆ పార్టీకి కూడా ఈ గుర్తు దక్కింది. టీడీపీ, జనసేన లు ఆది నుంచి పొత్తు పెట్టుకూనే ఉన్నాయి. ఆ తర్వాత వీరి జట్టులోకి బీజేపీని తీసుకువచ్చారు. నామినేషన్ల పర్వం ముగిసి,, గుర్తులు కూడా ఓకే అయినపోయిన తర్వాత నవతరం పార్టీ అనూహ్యంగా పోటీ నుంచి ఉపసంహరించుకొని ఎన్డీయే కూటమికి మద్దతు ప్రకటించింది.

అయితే ఇది అప్పటికప్పుడు కూర్చొని మాట్లాడిన సమావేశంలా కనిపించడం లేదు. గతంలో నవతరం పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం చంద్రబాబుతో కలిసినవి.. టీడీపీ ముఖ్య నాయకులతో కలిసి దిగిన, నారా లోకేశ్ యువగళం ప్రచారంలో పాల్గొన్న ఫొటోలు బయటకు వచ్చాయి.  ఈ గాజు గ్లాస్ గేమ్ వెనుక చంద్రబాబు ఉన్నారా అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ పవన్ తన మాట వినకుంటే దెబ్బ తీసేందుకు ఈ తరహా ఎత్తుగడకు ప్లాన్ చేశారా.. లేక జనసేనకు ముందే పొంచి ఉన్న ప్రమాదాన్ని ముందే పసిగట్టి పవన్ కు మేలు చేసేందుకు తన అనునూయిల చేత ఈ గుర్తు కోసం దరఖాస్తు చేయించారా అనేది ఎవరికీ అర్థం కావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: