వామ్మో.. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ అలా ఉంటుందా..!?

Anilkumar
చేసింది రెండు మూడు సినిమాలు అయినప్పటికీ చాలా తక్కువ సమయంలో స్టార్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు సందీప్ రెడ్డి.  ఇటీవల ఆయన దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆ సినిమా తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆయన చేస్తున్న సినిమా స్పిరిట్.  ఈ సినిమాతో మరొక సక్సెస్ అందుకోవాలి అని గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగానే సినిమాకి సంబంధించిన ప్రతి పనులను దగ్గర నుండి చేస్తున్నట్లుగా సమాచారం

 వినబడుతుంది. ఇప్పటికీ ఆయన చేసిన అన్ని సినిమాలతో బ్లాక్ బస్టర్ అందుకున్న సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాని ఎలా డిజైన్ చేస్తాడు అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆడియన్స్. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమా కూడా యానిమల్ సినిమా అంతటి విజయాన్ని అందుకుంటుంది అని అందరూ ఆరాటపడుతున్నారు. అయితే స్పిరిట్ సినిమా విషయంలో చాలా చిన్న చిన్న డీటెయిల్స్ ని కూడా మిస్ కాకుండా చూసుకుంటున్నాడట సందీప్ రెడ్డి. ప్రతిదాన్ని చాలా లాజికల్ గా ఆలోచిస్తున్నారట. ఇదిలా ఉంటే

 ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. అంతేకాదు చాలా కొత్తగా ఇందులో ప్రభాస్ పాత్ర ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికి చాలామంది హీరోలు పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో కనిపించారు. కానీ ప్రభాస్ పాత్రను మాత్రం పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చాలా హైలెట్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఈ సినిమాతో మరొక బ్లాక్ మాస్టర్ అందుకోవాలి అని చూస్తున్నాడు సందీప్. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది.  ఈ సినిమాకి సంబంధించిన ఒక చిన్న గ్లిమ్స్ వీడియోని విడుదల చేయాలి అని సందీప్ రెడ్డి వంగా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం వినబడుతోంది .మరి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: