మావయ్య అంటూ చంద్రబాబుపై ఎక్కడిలేని ప్రేమ కురిపించిన తారక్..?
తారక్ తాజాగా ట్వీట్ చేస్తూ 'ప్రియమైన చంద్రబాబు మావయ్యకి ఈ చరిత్రాత్మక విజయాన్ని సాధించినందుకు శుభాకాంక్షలు. ఏపీని అభివృద్ధి పథం వైపు నడిపిస్తుందని ఆశిస్తున్నా. అద్భుత మెజార్టీతో గెలిచిన లోకేశ్, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయ్, ఎంపీలుగా గెలిచిన భరత్ కు, పురందీశ్వరి అత్తకు, ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ కు నా శుభాకాంక్షలు' అని పేర్కొన్నారు.
ప్రస్తుతం తారక్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. దీనిని కూడా పాజిటివ్ కోణంలో చూస్తున్నారు టీడీపీ తమ్ముళ్లు. మొన్నటిదాకా టీడీపీ స్పందించకపోవడంతో ఆయనకి, చంద్రబాబుకి మధ్య మాటలు లేవని చాలామంది రూమర్స్ క్రియేట్ చేశారు. అయితే రీసెంట్ ట్వీట్ తో వారి మధ్య అంతా బాగానే ఉంది అనే విషయం తెలిసిందని చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఇకపోతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సాధించిన విజయం భారతదేశంలో ఒక రికార్డు సృష్టించింది. త్వరలోనే చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత పవన్ పదవిని చేపడతారో చూడాలి. మంత్రి ఇస్తారా లేదంటే డిప్యూటీ సీఎం చేస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.