ఆ గ్రామానికి శిక్షగా కొన్నాళ్లుగా మూసేసిన ఆలయాన్ని మళ్లీ తెరిచిన నిఖిల్.. రియల్ హీరో అంటున్న ప్రేక్షకులు..!

lakhmi saranya
కార్తికేయ 2 తో మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరో నిఖిల్. ప్రస్తుతం స్వయంభు చిత్రంతో బిజీగా ఉన్నాడు ఈ హీరో. ఇందులో వారియర్ గా కనిపించబోతున్నాడు అఖిల్. అయితే నిజం జీవితంలోనూ దేవుడు అంటే అపారమైన భక్తి కలిగిన ఈ హీరో చీరాల గ్రామస్తులకు శిక్ష గా కొన్ని ఏళ్లుగా మూసేసి ఉన్న ఆలయాన్ని తెరిపించాడు. ఆ గుడి అభివృద్ధి బాధ్యతలు తీసుకుంటానని ప్రామిస్ చేశారు. ఎందుకు సహకరించిన ప్రతి ఒకరికి ధన్యవాదాలు చెబుతూ ఇందుకు సంబంధించిన వీడియో రిలీజ్ చేశాడు.
దీనిపై స్పందిస్తున్న ప్రేక్షకులు.. మంచిపని చేశారంటూ పొగుడుతున్నారు. ఇంత గొప్ప కార్యం చేసిన మీ కుటుంబాన్ని దేవుడు చల్లగా చూస్తాడని ఆశీర్వదిస్తున్నారు. కాదా నిఖిల్ కు రీసెంట్గా కూతురు పుట్టిన విషయం తెలిసిందే. కాగా ఆమె భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నారు. ఇక ఈ హీరో ప్రస్తుతం స్వయంభు మూవీ లో నటిస్తుండగా అదే లుక్ లో ఆలయాన్ని సంప్రదించడం విశేషం. ఆలయంపై పూల వర్షం కురిపిస్తూ గుడిలోకి స్వాగతించారు స్థానికులు.
సాధారణంగా ఏ హీరో అయినా రూపుదిద్దుకుంటున్న ఆలయాలకి డబ్బు సహాయం చేస్తూ ఉంటారు. కానీ శిక్షగా మూసివేసిన ఆలయాలని తెరిచే ప్రయత్నం చేయరు. అటువంటిది ఉన్నట్టుండి నిఖిల్ ఎటువంటి పని చేయడంతో పలువురు ఆశ్చర్యపోతున్నారు. గత కొంతకాలంగా పెద్దగా సినిమాలు చేయడం లేదు నిఖిల్. కార్తికేయ 2 తో సూపర్ హిట్ విజయమ్మ అందుకున్న ఈ హీరో అనంతరం ఆ రేంజ్ సక్సెస్ అందుకోలేకపోయారు. ఇక మరోసారి అటువంటి విజయం అందుకునేందుకు స్వయంభు మూవీతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. ఇక ఈ మూవీ నుంచి విడుదలైన ప్రతి ది కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది. మరి రిలీజ్ అనంతరం ఈ సినిమా ఎటువంటి రెస్పాన్స్ లెక్కించుకుంటుందో వేచి చూడాలి. ఈ సినిమా కనుక అఖిల్ కి మంచి సక్సెస్ ఇస్తే రానున్న రోజుల్లో పాన్ ఇండియా సినిమాలు చేసే అవకాశం కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: