మనమే ప్రీ రిలీజ్ ఈవెంట్ వెన్యూ ఫిక్స్.. ఎక్కడంటే..!?

Anilkumar
టాలీవుడ్ హీరో శర్వానంద్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా మనమే. శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. కాగా ఈ సినిమా జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. అయితే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ట్రైలర్ పాటలు విడుదల చేయక సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ ను అందుకున్నాయి. అయితే తాజాగా ఇప్పుడు సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరపబోతున్నారు చిత్ర బృందం. అయితే గత కొద్దిరోజులుగా మనమే సినిమాకి

 సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ పిఠాపురంలో జరుపబోతున్నారు అని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అంతేకాదు దానికి చీఫ్ గెస్ట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా వస్తున్నట్లుగా పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శర్వానంద్ ఇద్దరూ మంచి స్నేహితులు. ఇక ఆచనువుతోనే శర్వానంద్ మెగా పవర్ స్టార్ ని ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించారు అని కూడా వార్తలను ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదు అని తేలిపోయింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ

 రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్లో నిర్వహించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఈ రోజు సాయంత్రం 6 నుండి ఈ వేడుకలు మొదలు కాబోతున్నట్లుగా అధికారిక ప్రకటన చేశారు చిత్ర బృందం. పాపులర్ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాలో విక్రమ్ ఆదిత్య సిరత్ కపూర్ వెన్నెల కిషోర్ రాహుల్ రామకృష్ణ సుదర్శన్ వంటి వారు కీలక పాత్రలో నటి కనిపించబోతున్నారు. కాగా దీనికి చీఫ్ గెస్ట్ ఎవరు అన్న దాన్ని మాత్రం ఇప్పటివరకు రివిల్ చేయలేదు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలి అంటే సాయంత్రం 6 గంటల తర్వాత ఈ వేడుకలను ప్రత్యక్షంగా చూడాలి. ఇక శర్వానంద్ విషయానికి వస్తే.. ఇదివరకు ఆయన చేసిన సినిమాలన్నీ ఫ్లాప్స్ గా మారడంతో ఇప్పుడు ఈ సినిమా పైనే భారీ ఆశలను పెట్టుకున్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: