కల్కి మూవీలో కేవలం రెండు నిమిషాల కోసం ఆ స్టార్ హీరో..!?

Anilkumar
తెలుగు సినీ ఇండస్ట్రీ నుండి తాజాగా వస్తున్న అతి పెద్ద సినిమా కల్కి. ఈ సినిమా కోసం తెలుగు సినీ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమా 27వ తేదీన విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో పండగ వాతావరణం నెలకొంది. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన ఈ సినిమాను దాదాపుగా 600 కోట్లకు పైగా అనే భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దానికి తగ్గట్లుగానే భారీ కలెక్షన్స్ కూడా రాబడతాయి అని ఎంతో

 నమ్మకంగా ఉన్నారు చిత్ర బృందం. మొత్తానికైతే భారీ గ్రాఫికల్ మూవీగా వస్తున్న ఈ సినిమాతో నాగ్ అశ్విన్ ఎటువంటి విజయాన్ని అందుకుంటాడో చూడాల్సి ఉంది. ఇప్పటికే సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఈయన కల్కి సినిమాతో పది మెట్లు పైకి ఎక్కే ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. మొత్తానికైతే ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులందరూ 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాలో భారీ స్టార్ క్యాస్టింగ్ ఉన్నట్లుగా సమాచారం వినబడుతుంది. అమితాబచ్చన్ కమలహాసన్

 వంటి దిగ్గజ. నటులు ఇందులో నటిస్తున్నారట కానీ ఒక రెండు నిమిషాల పాటు ఉండే ఒక సీన్ కోసం మాత్రం మరో స్టార్ హీరోని రంగంలోకి దింపుతున్నారు అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఆ రెండు నిమిషాల కోసం ఏకంగా తమిళ స్టార్ హీరో సూర్య నీ తీసుకున్నట్లుగా సమాచారం. ఆయన అయితే ఈ పాత్రకి కరెక్ట్ గా సెట్ అవుతాడు అన్న ఉద్దేశంతో ఆ రెండు నిమిషాల పాత్ర కోసం తీసుకున్నరట. ఇక ఇందులో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంటుంది అని అంటున్నారు. ఇకపోతే సూర్య ఇందులో నటించడం వల్ల అటు తమిళంలో కూడా ఈ సినిమాకి మార్కెట్ భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకే అన్ని విధాలుగా ఆలోచించి సూర్యా అయితే ఇందుకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడు అని ప్లాన్ చేశాడు నగ్ అశ్విన్..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: