కోల్కతా జట్టుకి బిగ్ షాక్.. కెప్టెన్ దూరం?

praveen
మరికొన్ని రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కాబోతుంది. అయితే ఐపీఎల్ ప్రారంభమైందంటే చాలు ఇక ఇండియాలో క్రికెట్ పండగ షురూ అవుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే క్రికెట్ పండుగను ఎంజాయ్ చేసేందుకు అటు ప్రేక్షకులందరూ కూడా సిద్ధం అయిపోతున్నారు. కొంతమంది స్టేడియం కు వెళ్లేందుకు సిద్ధమవుతుంటే.. ఇంకొంతమంది టీవీలకు అతుక్కుపోయి కన్నార్పకుండా మ్యాచ్ చూడటానికి రెడీ అవుతున్నారు.

 ఇక ఎప్పటిలాగానే అన్ని టీమ్స్ కూడా టైటిల్ గెలవడమే లక్ష్యంగా ప్రణాళికలను సిద్ధం చేసుకుని బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయ్. ఇక ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు   ప్రీ క్యాంప్ నిర్వహించగా అందరూ ఆటగాళ్లు ఒక్కొక్కరిగా ఇక జట్టు క్యాంపులో చేరుతున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుండగా.. ఇక కొన్ని టీమ్స్ కి మాత్రం ఊహించని షాక్ లు తగులుతూ ఉన్నాయి. జట్టులో కీలక ఆటగాళ్లుగా కొనసాగుతున్న ప్లేయర్లు గాయం బారిన పడి చివరికి జట్టుకు దూరమవుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి అని చెప్పాలీ.

 కాగా మరో ఎనిమిది రోజుల్లో ఐపీఎల్ 2024 ప్రారంభం కాబోతూ ఉండగా కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకి బిగ్ షాక్ తగలబోతుంది అన్నది తెలుస్తుంది. ఎందుకంటే జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న శ్రేయస్ అయ్యర్  గాయం బారిన పడ్డాడు. తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. ఇటీవల రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఆడుతున్న అతను పలుమార్లు వెన్నునొప్పి కారణంగా ఇబ్బంది పడటం కనిపించింది. అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం అతను స్కానింగ్ కోసం ఆసుపత్రికి వెళ్ళినట్లు సమాచారం. కాగా ఇక అతని గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే ఐపీఎల్ మొదటి దశలోని కొన్ని మ్యాచ్లకు దూరంగా ఉండే అవకాశం ఉంది. దీంతో కొత్త కెప్టెన్ గా ఎవరిని నియమిస్తారు అన్న విషయంపై కూడా చర్చ జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: