భారత క్రికెటర్ రిటైర్మెంట్.. కెప్టెన్ రోహిత్ ఏమన్నాడంటే?

praveen
ఎన్నో రోజుల నుంచి ఉత్కంఠ భరితంగా సాగుతూ వచ్చిన రంజీ ట్రోఫీ ఇటీవలే  ముగిసింది అన్న విషయం తెలిసిందే. కాగా ఫైనల్ మ్యాచ్లో ముంబై విదర్భ జట్ల మధ్య పోటీ జరిగింది. ఈ క్రమంలోనే ఇక ఇప్పటికే ఎన్నోసార్లు ఫైనల్ లో అడుగుపెట్టి ఎన్నోసార్లు రంజి ట్రోపిని అందుకున్న ముంబై ఇండియన్స్ మరోసారి ఇక విదర్భ జట్టును ఓడించి ఛాంపియన్గా అవతరించింది అని చెప్పాలి. ఇక రంజిత్రోఫీ చరిత్రలోనే 46 సార్లు టైటిల్స్ అందుకున్న జట్టుగా ముంబై చరిత్ర సృష్టించింది. అయితే రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ కి ముందే భారత క్రికెటర్ దావల్ కులకర్ణి తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరియర్ కు వీడ్కోలు పలికాడు అన్న విషయం తెలిసిందే.

 కానీ ఆ తర్వాత జట్టులో ఒక ఆటగాడు గాయం బారిన పడటంతో రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా.. ఇక ముంబై జట్టు తరఫున ఫైనల్ మ్యాచ్ ఆడాడు దావల్ కులకర్ణి. అయితే ఇక రంజి ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టీం పై గెలిచిన తర్వాత కులకర్ని ఎమోషనల్ అయ్యాడు అని చెప్పాలి. తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్ ని ముగించడం ఎంతో కష్టంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఇప్పుడు వరకు దవల్ కులకర్ణి 96 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో 241 వికెట్లు, 12 వన్డే మ్యాచ్లో 19 వికెట్లు, ఐపీఎల్ లో 86 వికెట్లు తీసాడు.

 ఈ క్రమంలోనే దావల్ కులకర్ణి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో చేసిన సేవలను కొనియాడుతూ అందరూ కూడా అతనిపై ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే కులకర్ణి రిటైర్మెంట్ పై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సైతం స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వారియర్ ఆఫ్ ముంబై.. అద్భుతమైన కెరియర్ అంటూ ప్రశంసలు కురిపించాడు. అయితే గతంలో అటు రోహిత్ శర్మ సైతం ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఉన్న ముంబై జట్టుకు ఆడుతూ ఇక ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ లతో జట్టు విజయాలలో కీలకపాత్ర వహించేవాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: