టి20 వరల్డ్ కప్ లో కొత్త రూల్.. ఇక కెప్టెన్లకు కష్టాలు తప్పదు?

praveen
క్రికెట్ ప్రమాణాలను మరింత పెంచేందుకు అందరికీ నాణ్యమైన క్రికెట్ అందించేందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎప్పటికప్పుడు అటు క్రికెట్లో కొత్త రూల్స్ తీసుకు వస్తూనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కొత్త రూల్స్ ప్రకారం ఎక్కడ సమయం వృధా లేకుండా క్రికెట్ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది ఐసీసీ. అయితే ఇలా కొన్ని కొన్ని సార్లు ఐసిసి తీసుకువచ్చే కొత్త రూల్స్ అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి. అంతేకాదు ఆటగాళ్లను సైతం ఒత్తిడిలోకి నెడుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.

 అయితే ఇప్పటికే వికెట్ పడిన తర్వాత మరో బ్యాట్స్మెన్ వచ్చి ఇక బంతిని ఎదుర్కోవడానికి ఎంత సమయం ఉంటుంది అనే విషయంపై ఐసీసీ ఒక కఠినమైన రూల్ పెట్టింది. కేవలం 60 సెకండ్ల లోపు ఇక మరో బ్యాట్స్మెన్ వచ్చి బంతిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. లేదంటే టైమ్డ్ ఔట్ ద్వారా ఇక సదరు బ్యాటర్ వికెట్ కోల్పోవాల్సి ఉంటుంది. అయితే ఇక ఇప్పుడు బౌలింగ్ విషయంలో కూడా ఇలాంటి ఒక కఠినమైన రూల్ తీసుకువచ్చింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్  ఇక ఈకొత్త రూల్ అటు జట్టు కెప్టెన్లపై తప్పకుండా ఒత్తిడి పెంచుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వన్డే ఫార్మాట్ తో పాటు టి20 ఫార్మాట్లో కూడా స్టాప్ క్లాక్ రూల్ అమలు చేసేందుకు ఐసీసీ ఆమోదం తెలిపింది.

 అయితే ఈ రూల్ ప్రకారం ఫీల్డింగ్ జట్టు ఒక ఓవర్ పూర్తయిన తర్వాత 60 సెకండ్ల సమయంలోనే తర్వాతి ఓవర్ ను ప్రారంభించాల్సి ఉంటుంది. అయితే ఇలా ఒక ఓవర్ పూర్తయిన వెంటనే స్టేడియంలో ఉండే బిగ్ స్క్రీన్ పై 60 సెకండ్ల కౌంట్ డౌన్ డిస్ ప్లే అవుతూ ఉంటుంది  అయితే అది జీరోకి వచ్చేలోపు తదుపరి ఓవర్ ను స్టార్ట్ చేయాలి. ఇక ఎవరైనా కెప్టెన్ ఈ రూల్ ని ఉల్లంఘిస్తే.  రన్స్ పెనాల్టీ లేదా జరిమానా విధించే అవకాశం ఉంది అని చెప్పాలి. రానున్న రోజుల్లో టి20 వరల్డ్ కప్ లో కూడా ఈ కొత్త రూల్ ని అమలు చేయబోతున్నారు అన్నది తెలుస్తుంది. ఒక ఓవర్ ముగిసిన వెంటనే తర్వాత ఓవర్ ఎవరితో వేయించాలి అనే విషయంలో ఇక ఇలాంటి నిబంధన కారణంగా కెప్టెన్లు కాస్త ఒత్తిడికి గురై అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: