నా కాలు తీసేస్తారని అనుకున్న.. రిషబ్ పంత్ షాకింగ్ కామెంట్స్?

praveen
దాదాపు ఏడాదికి పైగానే క్రికెట్కు దూరం గా ఉన్న రిషబ్ పంత్ ఇక గాయాలనుంచి కోల్కొని ప్రస్తుతం పూర్తిస్థాయి కొట్టిన సాధించాడు అన్న విషయం తెలిసింది ఈ క్రమంలోనే మార్చి 22వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే ఐపీఎల్ సీజన్లో ఆడి ఆదరకొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. గత కొంతకాలం నుంచి రిషబ్ పంత్ రీ ఎంట్రీ కోసం అటు అభిమానులు కూడా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు అన్న విషయం తెలిసిందే..

 అయితే 2022 డిసెంబర్లో రోడ్డు ప్రమాదం బారిన పడ్డాడు రిషబ్ పంత్. ఇక ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ క్రమంలోనే ఈ ప్రమాదం నుంచి కోలుకునేందుకు అతనికి దాదాపు ఏడాదికి పైగా అనే సమయం పడుతుంది. అప్పటినుంచి కూడా పూర్తిగా క్రికెట్కు దూరం అయిపోయాడు రిషబ్ పంత్. అయితే అతను లేకుండానే టీమ్ ఇండియా అని ఫార్మాలలో మ్యాచ్లు ఆడుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఇన్ని నెలల గ్యాప్ తర్వాత మళ్లీ ఐపీఎల్ పునరాగమనం చేయబోతున్నాడు. అయితే ఇక యాక్సిడెంట్ జరిగిన సమయంలో తాను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు రిషబ్ పంత్.

 రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత వైద్యులు తన కాలను తీసేస్తారేమో అని అనుకున్నాను అంటూ రిషబ్ పంత్ చెప్పుకొచ్చాడు. యాక్సిడెంట్ అయినప్పుడు ఏదో శక్తి నన్ను కాపాడినట్లు అనిపించింది. ఇంతకు మించిన ఘోర ప్రమాదం నా కలలో కూడా ఊహించలేను  నా కాలు తొలగించడం గురించి కూడా డాక్టర్లు నాతో మాట్లాడటం మరింత షాకింగ్ గా అనిపించింది. అయితే కాలు తీసేస్తారు అని అనుకున్నాను. కానీ దేవుని దయవల్ల మళ్లీ కోల్కొని క్రికెట్ ఆడేందుకు సిద్ధమవుతున్నాను అంటూ రిషబ్ పంత్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 17వ సీజన్లో రిషబ్ పంత్ ఢిల్లీ జట్టును కెప్టెన్గా ముందుకు నడిపించబోతున్నాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: