వావ్.. అశ్విన్ మళ్లీ సాధించాడు?

praveen
క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో ఆయా ఆటగాళ్లు చేసిన ప్రదర్శన ఆధారంగా అటు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎప్పటికప్పుడు ర్యాంకింగ్స్ ని ప్రకటిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఐసీసీ ప్రకటించి ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని సొంతం చేసుకోవాలని ప్రతి ఒక్క ఆటగాడు కూడా ఆశపడుతూ ఉంటాడు. మరి ముఖ్యంగా టెస్ట్ ఫార్మాట్లో నెంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకుంటే.. ఇక ఆ సంతోషం మాటల్లో వర్ణించలేని విధంగా ఉంటుంది అని చెబుతూ ఉంటారు. అయితే గత కొంతకాలం నుంచి అటు రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానంలో నిలిచేందుకు పోటీ పడుతున్నాడు. ఇక ఇటీవల ఇది సాధించాడు.

గత కొంతకాలం నుండి టెస్ట్ ఫార్మట్ లో రవిచంద్రన్ అశ్విన్ ఎంత అద్భుతమైన ప్రదర్శనలు చేస్తూ ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . ఇటీవల ఇంగ్లాండుతో ముగిసిన టెస్ట్ సిరీస్ లో కూడా అదరగొట్టేసాడు. భారత జట్టు ఈ టెస్ట్ సిరీస్ లో విజయం సాధించింది అంటే అటు రవిచంద్రన్ అశ్విన్ దే కీలక పాత్ర ఉంది అని చెప్పాలి.  అయితే గత కొంతకాలం నుంచి అగ్రస్థానం కోసం పోటీ పడుతున్న రవిచంద్రన్ అశ్విన్.. ఎట్టకేలకు నెంబర్ వన్ ర్యాంకు వచ్చేసాడు.

 ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ టెస్ట్ ర్యాంకింగ్స్ ని ప్రకటించింది. ఈ ర్యాంకింగ్స్ లో అశ్విన్ మాత్రమే కాదు భారత ఆటగాళ్లు కూడా సత్తా చాటారు అని చెప్పాలీ. ఏకంగా బౌలర్ల ర్యాంకింగ్స్ లో అశ్విన్ నెంబర్ వన్ బౌలర్గా నిలిచాడు. 870 పాయింట్లతో ఒక స్థానం మెరుగుపరచుకొని అగ్రస్థానానికి ఎగబాకాడు. రాంకింగ్స్ లో రోహిత్ శర్మ ఆరు, జైస్వాల్ 8, విరాట్ కోహ్లీ 9 రాంకింగ్స్ తో టాప్ టెన్ లో ఉన్నారు. ఇక ఆల్ రౌండర్లా జాబితాలో  రవీంద్ర జడేజా, అశ్విన్ తొలి రెండు స్థానాలలో ఉండడం గమనార్హం. ఇలా భారత ఆటగాళ్లదే హవా నడుస్తుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: