షాకింగ్ : వరల్డ్ కప్ నుంచి.. కోహ్లీని బిసిసిఐ పక్కన పెట్టబోతుందా?

praveen
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా జూన్ నెలలో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అన్న విషయం తెలుస్తుంది. అయితే వెస్టిండీస్ యూఎస్ వేదికలుగా జరగబోయే ఈ ప్రపంచకప్ టోర్నిలో టైటిల్ విజేతగా నిలవడానికి అన్ని టీమ్స్ కూడా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయ్. ఇప్పటికే ఇక ఐసీసీ ఈ ప్రపంచకప్ టోర్నకి సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూల్ ని విడుదల చేసింది అన్న విషయం తెలిసిందే. అయితే గత ఏడాది వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ వరకు అద్భుతమైన ప్రదర్శన చేసి ఫైనల్ లో ఓడిపోయి టైటిల్ కలను నెరవేర్చుకోలేకపోయిన టీమ్ ఇండియా ఇక పోట్టి వరల్డ్ కప్ లో మాత్రం తప్పకుండా విజయం సాధించాలని లక్ష్యాన్ని పెట్టుకుంది.

 అయితే ఇక ప్రపంచకప్ కోసం ఎంపిక చేయబోయే జట్టులో ఎవరు చోటు దక్కించుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే హార్దిక్ పాండ్యా టి20 వరల్డ్ కప్ కు కెప్టెన్సీ వహిస్తాడని అనుకున్నప్పటికీ   ఇక రోహిత్ శర్మ సారధ్యంలోనే టీమ్ ఇండియా బరీలోకి దిగబోతుంది అనే విషయంపై క్లారిటీ వచ్చేసింది   అయితే ఇక విరాట్ కోహ్లీ కూడా ఈ టి20 వరల్డ్ కప్ లో అదరగొడతాడని అందరూ అనుకుంటూ ఉన్నారు. ఇలాంటి సమయంలో కోహ్లీ అభిమానులందరికీ ఆందోళన కలిగించే ఒక వార్త తెరమీదికి వచ్చింది. ఏకంగా విరాట్ కోహ్లీని t20 వరల్డ్ కప్ నుంచి తప్పించబోతున్నారట.

 అదేంటి కోహ్లీ లేని టీమిండియాని ఊహించుకోవడమే కష్టం. అలాంటిది కోహ్లీనీ వరల్డ్ కప్ జట్టు నుంచి తప్పించడం ఏంటి.. అని అందరూ షాక్ అవుతున్నారు. అయితే కోహ్లీ టీ20 వరల్డ్ కప్ జట్టు నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం  వెస్టిండీస్ స్లో వికెట్ పిచ్లు విరాట్ కోహ్లీకి సూట్ కావని బీసీసీఐ భావిస్తుంది అంటూ క్రికెట్ వర్గాల్లో ఒక చర్చ నడుస్తుంది   ఈ క్రమంలోనే ఇక టి20 వరల్డ్ కప్ నుంచి తప్పుకునేలా ఇప్పటికే బీసీసీఐ కోహ్లీ ఒప్పించేందుకు చర్చలు కూడా జరుగుతున్నాయట. అయితే ఇలా కోహ్లీని ఒప్పించే బాధ్యతలను చీఫ్ సెలెక్టర్ అగర్కర్ తీసుకున్నట్లు సమాచారం. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: