మరో 9 రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం.. అంతలో ముంబై ఇండియన్స్ కి బ్యాడ్ న్యూస్?

praveen
బిసిసిఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది అంటే చాలు ఇండియాలో క్రికెట్ పండగ మొదలవుతూ ఉంటుంది. సాధారణంగా ఏదైనా పండుగ అంటే ఒకటి రెండు రోజులు మాత్రమే జరుగుతూ ఉంటుంది. కానీ ఐపిఎల్ అనే క్రికెట్ పండగ మాత్రం దాదాపు నెలన్నర పాటు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది. ఇక ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్కరు కూడా టీవీలకు అతుక్కుపోయి మ్యాచ్ను వీక్షిస్తూ ఉంటారు. మరి కొంతమంది ఏకంగా స్టేడియం కు వెళ్లి ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షిస్తూ తమ అభిమాన జట్టుకు మద్దతు పలకడానికి ఇష్టపడుతుంటారు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే ఇక ఇప్పుడు ఐపీఎల్ కు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదలైన నేపథ్యంలో అన్ని టీమ్స్ కూడా 2024 ఐపీఎల్ సీజన్లో టైటిల్ గెలవడం లక్ష్యంగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే ఇప్పటికే ఐదు సార్లు టైటిల్ గెలిచి అత్యధిక టైటిల్స్ గెలిచిన టీం గా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ సైతం.. ఆరోసారి టైటిల్ గెలవాలని అనుకుంటుంది. అయితే ఈసారి కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా సారథ్యంలో బరిలోకి దిగబోతుంది అన్న విషయం తెలిసిందే.  ఇక మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ జట్టులో కీలక ఆటగాడిగా వ్యవహరించేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఇలా మరో తొమ్మిది రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుండగా.. అంతలో ముంబై ఇండియన్స్ కి ఊహించిన షాక్ తగిలింది.

 ఐపీఎల్ మార్చి 22వ తేదీన ప్రారంభం కాబోతుండగా.. ఇక రెండు రోజుల తర్వాత ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్ ఆడబోతుంది. అయితే ఆ జట్టుకు ఐపీఎల్ ప్రారంభానికి ముందు షాక్ తగిలింది. జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతున్న సూర్య కుమార్ యాదవ్ గాయం నుంచి ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదట. ఇప్పటికీ అతను ఎన్సిఏ లో రిహాబిలేషన్ లోనే ఉన్నాడు అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే సూర్యకు నేషనల్ క్రికెట్ అకాడమీ నుంచి క్లియరెన్స్ రాలేదని క్రికెట్ వర్గాల నుంచి సమాచారం. దీంతో మార్చి 24న గుజరాత్ తో 27వ తేదీన సన్రైజర్స్ హైదరాబాద్ తో జరగబోయే మ్యాచ్లకు సూర్యకుమార్ యాదవ్ అందుబాటులో ఉండబోడు అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: