టీమిండియా వద్దని పక్కన పెట్టింది.. కట్ చేస్తే?

praveen
గత కొంతకాలం నుంచి ఎంతో రసవత్తరంగా సాగుతూ వస్తున్న ప్రతిష్టాత్మకమైన దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఫైనల్ లో ఛాంపియన్ టీం గా గుర్తింపును సంపాదించుకున్న ముంబై ఇండియన్స్ చేరగా.. ఇక మరోవైపు విదర్భ జట్టు కూడా ఫైనల్ వరకు అడుగుపెట్టింది. కాగా ప్రస్తుతం ఇక ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ నువ్వా నేనా అన్నట్లుగా ఉత్కంఠ భరితంగా సాగుతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన విధంగా జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఇక ఈ మ్యాచ్ లో అటు ముంబై ఇండియన్స్ కి మాత్రం మంచి శుభారంభం దక్కలేదు.

 ఏకంగా ముంబై జట్టు లంచ్ సమయానికి 109 పరుగులు చేసి నాలుగు కీలకమైన వికెట్లు కోల్పోయింది. అయితే లంచ్ తర్వాత కూడా పరిస్థితి ఇలాగే కొనసాగింది. 224 పరుగులు జోడించి మరో ఆరు వికెట్లను కోల్పోయింది ముంబై. అయితే అందరూ బ్యాట్స్మెన్లు వరుసగా విఫలమవుతున్న సమయంలో ముంబై బ్యాట్స్మెన్ శార్దూల్ ఠాగూర్ మాత్రం మరోసారి సత్తా చాటాడు. ఏకంగా ఎనిమిదవ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి వచ్చిన శార్దూల్ ఠాగూర్ తుఫాన్ ఇన్నింగ్స్ తో ఏకంగా విదర్భ బౌలర్లకు చెమటలు పట్టించాడు. 37 బంతుల్లోని అర్థ సెంచరీ సాధించాడు ఈ ఆటగాడు. ఇక ఇందులో ఆరు ఫోర్లు రెండు సిక్సర్లు ఉండడం గమనార్హం.

 కాగా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో శార్ lదూల్ ఠాగూర్ కి ఇది 12వ హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. అయితే చివర్లో వచ్చి శార్దూల్ ఠాగూర్ ఆడిన ఈ మెరుపు ఇన్నింగ్స్ కారణంగానే ముంబై జట్టు చెప్పుకోదగ్గ స్కోర్ చేయగలిగింది అని చెప్పాలి. మొత్తంగా 75 పరుగులు చేసి చివరికి వికెట్ గా పెవిలియన్ చేరాడు శార్దూల్ ఠాగూర్. అతను ఇన్నింగ్స్ మొత్తంలో ఎనిమిది ఫోర్లు మూడు సిక్సర్లు ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే శార్దూల్ ఠాగూర్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారిపోయింది. టీమిండియా సెలెక్టర్లు ఇటీవల శార్దూల్ ఠాగూర్ ని ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ కోసం ఎంపిక చేయలేదు. అయితే ఇలా సెలెక్టర్లు వద్దు అని పక్కన పెట్టిన ఆటగాడు.. ఇక ఇప్పుడు రంజీ ట్రోఫీలో అదరగొట్టేస్తూ ఉన్నాడు అని చెప్పాలి.  అయితే రంజీ ట్రోఫీ సెమీఫైనల్ లో కూడా తమిళనాడుతో జరిగిన మ్యాచ్లో ఏకంగా సెంచరీ తో చెలరేగిపోయాడు ఈ ఆటగాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: