ఐపీఎల్ - 2024 తర్వాత.. అతను రిటైర్మెంట్ ప్రకటిస్తాడట తెలుసా?

praveen
ఇండియాలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ కు సంబంధించిన హడావిడి మొదలైంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే బీసీసీఐ ఐపీఎల్ కు సంబంధించిన షెడ్యూల్ ను కూడా విడుదల చేసింది. మార్చ్ 22వ తేదీ నుంచి కూడా ఐపీఎల్ ప్రారంభం కాబోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక అన్ని టీమ్స్ కూడా టైటిల్ గెలవడమే లక్ష్యంగా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంది. అదే సమయంలో ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో టైటిల్ విజేతగా నిలవబోయే జట్టు ఏది అనే విషయంపై కూడా ఎంతో మంది మాజీ ఆటగాళ్లు తమ రివ్యూలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇలాంటి రివ్యూలు కూడా తెగ వైరల్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి.

 అయితే ఈ ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత కొంతమంది సీనియర్ క్రికెటర్లు తమ కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాంటి ఆటగాళ్ళలో దినేష్ కార్తీక్ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. అనూహ్యంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఛాన్స్ దక్కించుకున్న దినేష్ కార్తీక్ తన ఆటతీరుతో ఎలా సర్ ప్రైస్ చేస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా దూకుడు అయిన ఆట తీరుతో ఆర్సిబి విజయాలలో కీలకపాత్ర వహించాడు. అద్భుతమైన ఫినిషింగ్ తో అదరగొట్టేసాడు  ఇక ఇలాంటి ఆట తీరుతోనే అటు భారత జట్టులోకి కూడా మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాడు.

 కానీ ఆ తర్వాత కాలంలో మాత్రం ఇదే ఆట తీరుని కొనసాగించలేక నిరాశపరిచాడు. ఇక తర్వాత ఐపిఎల్ సీజన్లోనూ దినేష్ కార్తీక్ పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. అయితే ఈ ఏడాది అతనికి ప్రదర్శన ఎలా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ప్రస్తుతం అతనికి 38 ఏళ్లు. కాగా ఐపీఎల్ 2024 ముగిసిన వెంటనే అతను అంతర్జాతీయ క్రికెట్ తో పాటు ఐపీఎల్ కు వీడ్కోలు పలికే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. ఐపీఎల్ ముగిశాక  తర్వాత కేవలం తమిళనాడు తరపున దేశవాళి క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు. కాగా గత కొంతకాలంగా వ్యాఖ్యాత వృత్తిలో అదరగొడుతున్న దినేష్ కార్తీక్ ఇక ఈ వృత్తిపైనే పూర్తిస్థాయి ఫోకస్ పెట్టడానికి నిర్ణయించుకున్నాడు అన్నది తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: