ప‌వ‌న్ కోసం సీటు త్యాగం చేసిన నేత పార్ల‌మెంటులో అడుగు పెట్టేసిన‌ట్టేనా ?

RAMAKRISHNA S.S.
- పిఠాపురం సీటు వ‌దులుకుని కాకినాడ పార్ల‌మెంటు బ‌రిలో ఉద‌య్ శ్రీనివాస్‌
- కూట‌మి బ‌లంగా ఉన్న చోట పోటీయే బ‌లం
- త‌న పార్ల‌మెంటులోనే ప‌వ‌న్ పోటీతో భారీ మెజార్టీపై గురి..?
- మూడుసార్లు ఓడిన సునీల్ ప‌ట్ల విప‌రీత‌మైన సానుభూతి..?
( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసమే తన సీటు వదులుకున్న ఆ నేత ఇప్పుడు గెలిచి పార్లమెంటులో అడుగు పెడతారా.. అసెంబ్లీకి వెళ్లాలనుకున్న ఆ నేత ఆ ఛాన్స్ రాక పార్లమెంటు సీటు రావడంతో పార్లమెంటు పోరులో విజయం సాధిస్తారా ? అటువైపు వరుసగా గత మూడు ఎన్నికల్లోను స్వల్ప తేడాతో ఓడిపోతూ వస్తున్న నేతపై విజయం సాధిస్తారా.. అన్నది ఆసక్తిగా మారింది. ఇద్దరు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతల పోరుకు కాకినాడ పార్లమెంటు సీటు వేదికగా మారింది. వైసీపీ నుంచి గత మూడు ఎన్నికలలోను వరుసగా ఓడిపోతూ వస్తున్న చలమలశెట్టి సునీల్ పోటీలో ఉండగా కూటమిలో భాగంగా జనసేన నుంచి రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కడియంకు చెందిన తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు.

టీ టైం స్టాల్స్ ద్వారా దేశవ్యాప్తంగా కొన్ని వేల మందికి ఉపాధి కల్పించిన ఉదయ శ్రీనివాస్‌ వాస్తవంగా పిఠాపురం అసెంబ్లీ సీటు ఆశించారు. అయితే అక్కడ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా పోటీలో ఉండడంతో తనకోసం పిఠాపురం సీటు త్యాగం చేసిన ఉదయ్‌కు పవన్ ఏకంగా కాకినాడ పార్లమెంటు సీటు కేటాయించారు. జనసేన పోటీ చేస్తున్న రెండు పార్లమెంటు స్థానాలలో కాకినాడ ఒకటి. రెండోది మచిలీపట్నం. ఉదయ్ శ్రీనివాస్ రాజకీయాలకు పూర్తిగా కొత్త కావడంతో క్లీన్ ఇమేజ్‌తో బరిలోకి దిగుతున్నారు. ఆయనపై ఎలాంటి మచ్చలు లేవు. దీనికి తోడు కూటమి చాలా బలంగా ఉన్న పార్లమెంట్ స్థానాలలో కాకినాడ కూడా మొదటి స్థానంలో ఉంటుంది.

పైగా ఇదే పార్లమెంట్లు పరిధిలోని పిఠాపురం నుంచి ఏకంగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండడం కూడా శ్రీనివాస్ కు కలిసి రానుంది. అయితే అటు వైసీపీ నుంచి పోటీలో ఉన్న చలమలశెట్టి సునీల్ కు కూడా వ్యక్తిగతంగా మంచి పేరు ఉంది. గత మూడు ఎన్నికలలోను స్వల్ప తేడాతో వరుసగా ఓడిపోతూ వస్తుండడంతో.. ఈసారి సునీల్‌ పై చాలా సానుభూతి కనిపిస్తోంది. ఆ మాటకు వస్తే వ్యక్తిగతంగా సునీల్ కి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. పైగా వరుస ఓట‌ముల‌తో చాలామందిలో సానుభూతిని కనిపిస్తోంది. పైగా పార్లమెంటు పరిధిలో తుని, కాకినాడ రూరల్, ప్రతిపాడు, జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం సీట్లను కూడా వైసీపీ కాపు వర్గానికి కేటాయించింది.

ఆ కోణంల్లో చూస్తే సునీల్ ను కూడా తక్కువ అంచనా వేయలేని పరిస్థితి. ఏది ఏమైనా వైసీపీ ఎన్నికుల సమీకరణలు ఎన్ని ఎత్తులు వేసిన చివరికి ముద్రగడ పద్మనాభం లాంటి నేతలను పార్టీలో చేర్చుకునే పిఠాపురంలో ప్రచారం చేయిస్తున్నా.. పిఠాపురంలో కోట్లాది రూపాయలు మంచి నీళ్ళ‌లా ఖర్చు చేస్తున్నా.. ఇటు సునీల్ కు సానుభూతి ఉన్నా కూడా ప్రస్తుతానికి అయితే కాకినాడ పార్లమెంటులో జనసేన అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ కు స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోంది. అయితే ఇక్కడ సునీల్ గెలిస్తే అది కేవలం సునీల్ వ్యక్తిగత ఇమేజ్.. అతడిపై ఉన్న సానుభూతి మాత్రమే అవుతుంది. అది జరగటం కూడా చాలా కష్టం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: