సచిన్ సంచలన పోస్ట్.. ఇషాన్, అయ్యర్ల గురించేనా?

praveen
ఐపీఎల్ సహా కేవలం జాతీయ జట్టు తరఫున మాత్రమే ఆడాలి. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్లు ఆడకపోయిన పరవాలేదు అని అనుకున్న నేపథ్యంలో అటు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్లపై బీసీసీఐ చర్యలు తీసుకుంది. ఏకంగా ఇద్దరు ఆటగాళ్లను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది అన్న విషయం తెలిసిందే. అయితే బీసీసీఐ నిర్ణయం తీసుకున్న నాటి నుంచి కూడా ఇక తప్పకుండా అందరూ ప్లేయర్లు రంజి మ్యాచులు ఆడాల్సిందే అన్న విషయంఫై చర్చ జరుగుతూ ఉంది.

 ఇదే విషయంపై పలుమార్లు కెప్టెన్ రోహిత్ శర్మ కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా స్పందించారు. ఎవరైతే ఆటగాళ్ళు దేశవాళీ క్రికెట్లో మ్యాచ్ లు ఆడతారో అలాంటి ఆటగాళ్ళకు మాత్రమే జాతీయ జట్టు సెలక్షన్ చేసే సమయంలో మొదటి ప్రాధాన్యత ఉంటుంది అని తేల్చి చెప్పారు.  కేవలం ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడిన ప్లేయర్లకు మాత్రమే జాతీయ జట్టులో చోటు దక్కుతుందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో  ఎంతోమంది మాజీ ప్లేయర్లు కూడా అటు బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి. ఇక ఇదే విషయంపై భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కూడా స్పందించాడు.

 ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడలేము అంటూ సెంట్రల్ కాంట్రాక్ట్ నే కోల్పోయిన ఇషాన్ కిషన్,  శ్రేయస్ అయ్యర్ లకు గుణపాఠం చెప్పే విధంగా సచిన్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు అని చెప్పాలి. నా కేరియర్ లో అవకాశం వచ్చినప్పుడు ముంబై జట్టుకు ఆడేవాడిని.. డ్రెస్సింగ్ రూమ్ లో దాదాపు 8 మంది జాతీయ జట్టుకు ఆడే ప్లేయర్లు ఎప్పుడు కనిపిస్తూ ఉంటారు. ఇలా ఆడటం వల్ల అటు దేశవాళి క్రికెట్ కు మంచి క్రేజ్ పెరుగుతుంది. అదే సమయంలో ప్లేయర్ల ఆట తీరు కూడా మెరుగుపడుతుంది అంటూ సచిన్ టెండూల్కర్ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారిపోయింది. అంతే కాకుండా ఇటీవల కాలంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్కు బీసీసీఐ ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది అంటూ అటు సచిన్ టెండూల్కర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: