పార్లమెంట్ ఎలక్షన్స్.. ఐపీఎల్ కోసం బీసీసీఐ ప్లాన్ అదేనట?

praveen
ఇండియాలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలైంది అంటే చాలు భారత్ లో క్రికెట్ పండగ మొదలవుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక సంక్రాంతి దసరా మాత్రమే కాదు ఇక ఐపీఎల్ కూడా క్రికెట్ లవర్స్ అందరికీ కూడా అతిపెద్ద పండుగ గానే కొనసాగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే  అయితే సంక్రాంతి, దసరా పండుగలు కేవలం ఒకటి రెండు రోజులు మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటే.. అటు ఐపీఎల్ అనే పండుగను మాత్రం దాదాపు నెల రోజులపాటు క్రికెట్ ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటారు అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు 2024 ఐపీఎల్ సీజన్ కోసం సర్వం సిద్ధమవుతుంది. ఇక బిసిసిఐ ఇప్పటికే ఐపీఎల్ కు సంబంధించిన షెడ్యూల్ ని విడుదల చేసింది అన్న విషయం తెలిసిందే.

 అయితే డిసెంబర్లో జరిగిన మినీ వేలంలో ఎన్నో జట్లు తమ టీం లోని కొంతమంది ఆటగాళ్లను వదిలేసి కొత్త ఆటగాళ్లను జట్టులో చేర్చుకున్నాయి. దీంతో పలు టీంలు మరింత పటిష్టంగా మారిపోయావు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈసారి ఐపీఎల్ మరింత రసవత్తరంగా సాగడం ఖాయమని క్రికెట్ ఫ్యాన్స్ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే లోక్సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అటు ఐపీఎల్ నిర్వహణ సాధ్యమవుతుందా లేదా అనే విషయంపై గత కొంతకాలం నుంచి తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే.

 అయితే ఇక లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అటు బిసిసిఐ కూడా పూర్తిస్థాయి షెడ్యూల్ ఇప్పటివరకు విడుదల చేయలేదు. ఈ క్రమంలోనే ఐపీఎల్ అభిమానులకు ఇబ్బందులు కలగకుండా పాలకమండలి కసరత్తులు చేస్తుంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మ్యాచ్ జరిగే నగరంలో పోలింగ్ ఉంటే వేదికను మార్చాల్సి ఉంటుంది. సరిపడా సెక్యూరిటీ ఇవ్వలేదని పోలీసులు ఎలాగో చెబుతారు. అయితే ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ముందే ప్లాన్ చేసుకుని ఇక ఈసారి ఐపీఎల్ కు సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూల్ విడుదల చేస్తారట. దీనిపై ఇక ఐపీఎల్ పాలకమండలి కసరత్తులు చేస్తుంది అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: