అతను టెస్ట్ క్రికెట్ కి కొత్త.. అందుకే అలా ఆడుతున్నాడు : రోహిత్

praveen
ఇటీవల కాలంలో టీమిండియా జట్టులో అటు యువ ఆటగాళ్ళ హావా ఎక్కువైపోయింది అన్న విషయం తెలిసిందే. ఇక దేశవాళి క్రికెట్లో అదరగొడుతున్న ఎంతో మంది యంగ్ ప్లేయర్లు ఇక భారత సెలెక్టర్ల దృష్టిలో పడుతున్నారు. ఇలా దృష్టిలో పడ్డారో లేదో అటు జాతీయ జట్టులో అవకాశాలు దక్కించుకుంటున్నారు అని చెప్పాలి. అయితే ఇలా టీంలోకి వచ్చిన యువ ఆటగాళ్లు తమ సత్తా ఏంటో అతి తక్కువ సమయంలో నిరూపించుకుంటున్నారు. వచ్చిన అవకాశాలను ఎంతో బాగా సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు అని చెప్పాలి.

 తమ ఆట తీరుతో భారత జట్టులో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకునే లాగే కనిపిస్తూ ఉన్నారు ఎంతో మంది యంగ్ ప్లేయర్లు. అయితే యశస్వి జైష్వాల్, జూరేల్ లాంటి ప్లేయర్లు అదర కొడుతూ ఇక పరుగుల వరద పారిస్తూ అందరిని ఫిదా చేస్తూ ఉంటే.. రజత్ పాటిదార్ లాంటి ప్లేయర్లు మాత్రం ఎందుకో ఇక వచ్చిన అవకాశాలను సరిగ్గా వినియోగించుకోలేకపోతున్నారు. ఇక ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో ఛాన్స్ దక్కించుకున్న రజత్ పాటిదర్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయడం లేదు అన్న విషయం తెలిసిందే. దీంతో రానున్న రోజుల్లో అతను జట్టు నుంచి పక్కన పెట్టే అవకాశం ఉందని ఇక అందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో ఘోరంగా విఫలమవుతూ విమర్శలు ఎదుర్కొంటున్న యువ ఆటగాడు రాజత్ పాటిదార్ కు ఇక కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవలే మద్దతుగా నిలిచాడు. రజత్ పాటిదార్ కు టెస్టు క్రికెట్ కొత్త అని.. అతడికి మరింత సమయం ఇవ్వాలి అంటూ అభిప్రాయ పడ్డాడు కెప్టెన్ రోహిత్ శర్మ. అతని దగ్గర చాలా సామర్థ్యం ఉంది. ఎంతో నైపుణ్యం దాగి ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. రోహిత్ శర్మ వ్యాఖ్యలు చూస్తుంటే అతను యువ ఆటగాళ్లకు ఎంత మద్దతుగా నిలుస్తున్నాడో అర్థమవుతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: