దేశవాళి క్రికెట్ ఫై.. రోహిత్ కీలక వ్యాఖ్యలు?

praveen
బిసిసిఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్ని సూపర్ హిట్ అయింది  అయితే ఇక ఈ టోర్నీలో పాల్గొన్నాము అంటే కోట్ల రూపాయల ఆదాయంతో పాటు ఆశించిన దానికంటే ఎక్కువగానే పేరు ప్రఖ్యాతలు కూడా వస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. దీంతో ప్రతి ఒక్కరు కూడా అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఛాన్సులు దక్కించుకోవాలని ఆశపడుతున్నారు. ఇలాంటి సమయంలోనే కొంతమంది భారత క్రికెటర్లు ఐపీఎల్ మోజులో పడిపోయి అటు చివరికి దేశవాలి క్రికెట్ ని దూరం పెడుతూ వస్తున్నారు అన్న విషయం తెలిసిందే.

 భారత జట్టుకు దూరంగా ఉన్న సమయంలో కూడా అటు దేశవాళి క్రికెట్ ఆడెందుకు ఎక్కడా మొగ్గు చూపడం లేదు. దీంతో ఇక అటు భారత్ లో ఐపీఎల్ కారణంగా దేశవాళి క్రికెట్ రోజురోజుకీ ప్రమాదంలో పడిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో దేశవాళి  క్రికెట్ భవితవ్యాన్ని కాపాడేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇక కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దేశవాలి క్రికెట్ ని దూరం పెట్టిన ఇశాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ లను ఏకంగా సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తొలగిస్తూ షాకింగ్ నిర్ణయం తీసుకుంది.

 తప్పకుండా ప్రతి ఒక్క ఆటగాడు కూడా అటు దేశవాళి క్రికెట్లో మ్యాచ్ లు ఆడాల్సిందే అంటూ తేల్చి చెప్పింది. ఇక ఇటీవల ఇదే విషయం గురించి మాట్లాడిన కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దేశవాలి టోర్నీలలో ఎందుకు ఆడాలి అనే విషయంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. వైద్య బృందం ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వనంతవరకు కూడా ప్రతి ఒక్క ఆటగాడు దేశవాళీ క్రికెట్ ఆడటం చాలా ముఖ్యం. ముంబై తమిళనాడు మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ నేను చూశాను. దేశ వాలి క్రికెట్కు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో ముఖ్యం అంటూ చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ. కాగా రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: