మహిళా క్రికెట్ హిస్టరీలో.. ఇదే ఫాస్టెస్ట్ బాల్ తెలుసా?

praveen
మార్చ్ 22వ తేదీ నుంచి భారత క్రికెట్ ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఎప్పటిలాగానే 10 జట్లతో ఇక ఈ సమరం మొదలు కాబోతుంది అని చెప్పాలి. ఇక అంతకు ముందుగానే భారత క్రికెట్ ప్రేక్షకులకు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది ఉమెన్స్ ప్రీమియర్ లీగ్.  ఇక ఈ లీగ్ లోని ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా సాగుతూ ప్రేక్షకులకు అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది అని చెప్పాలి.

 మహిళా క్రికెటర్లు అందరూ కూడా తమ ప్రదర్శనతో అదరగొట్టేస్తున్నారు. ఇక ఎన్నో రికార్డులు కూడా కొల్లగొడుతున్నారు అని చెప్పాలి. అయితే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ జట్టు మరోసారి వరుస విజయాలతో దూసుకుపోతుంది. అయితే ఇటీవల ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా జరిగిన మ్యాచ్లో ఇక ముంబై ఇండియన్స్ బౌలర్ అరుదైన రికార్డును సృష్టించింది అని చెప్పాలి. ఏకంగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలోనే అత్యంత వేగమైన బంతిని విసిరింది. ఇది కాస్త ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారింది.

 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ బౌలర్ శబ్నమ్ ఇస్మాయిల్ ఇటీవలే ఒక అరుదైన రికార్డు సృష్టించింది. ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్లో ఒక వేగవంతమైన బంతిని విసిరింది. ఏకంగా గంటకు 132.1 కిలోమీటర్ల వేగంతో బంతి వేసింది. దీంతో మహిళా క్రికెట్లో అత్యంత వేగంగా బౌలింగ్ చేసిన బౌలర్గా నిలిచింది. ఆమె అయితే గతంలో ఈ రికార్డు దక్షిణాఫ్రికా బౌలర్ పేరిట ఉండేది. దక్షిణాఫ్రికా మాజీ బౌలర్ గతంలో 127, 128 కిలోమీటర్ల వేగంతో బంతిని విసరగా మహిళా క్రికెట్లో ఇదే అత్యంత వేగవంతమైన బంతిగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ రికార్డును బ్రేక్ చేసింది శబ్నమ్ ఇస్మాయిల్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: