సన్రైజర్స్ కి కొత్త కెప్టెన్.. తప్పు చేశారంటున్న ఆకాశ చోప్రా?

praveen
గత కొంతకాలం నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకి అస్సలు కలిసి రావడం లేదు అన్న విషయం తెలిసిందే. అప్పుడెప్పుడో డేవిడ్ వార్నర్ సారథిగా ఉన్న సమయంలో ఐపీఎల్లో పటిష్టమైన జట్టుగా మిగతా టీంలను భయపెట్టిన సన్రైజర్స్ ఇక డేవిడ్ వార్నర్ సహ కేన్ విలియంసన్ జట్టు నుంచి తప్పుకున్న నాటి నుంచి కూడా పేలవ ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది. దీంతో ప్రతి ఐపీఎల్ సీజన్లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగుతూ ఎక్కడ తమ ప్రదర్శనతో అభిమానులను సంతృప్తి పరచలేక పోతుంది అని చెప్పాలి.

 ఇలా ప్రతి సీజన్లో కూడా సన్రైజర్స్ చేత ప్రదర్శన చేసి తొర్ని నుంచి అర్ధాంతరంగానే నిష్క్రమించడం.. డకౌట్ లో కూర్చున్న కావ్య పాప అయ్యో అంటూ తల బాదుకోవడం ప్రతి సీజన్లో కూడా రిపీట్ అవుతూనే వస్తుంది. అయితే ఇప్పుడు 2024 ఐపీఎల్ సీజన్లో మాత్రం టైటిల్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకుంది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. ఈ క్రమంలోనే గత ఏడాది డిసెంబర్లో జరిగిన వేలంలో ఎంతోమంది ఆటగాళ్లను జట్టు నుంచి వదులుకోవడమే కాదు కొత్త ఆటగాళ్ళను భారీ ధరపెట్టి మరి కొనుగోలు చేసింది. ఈ క్రమంలోనే ప్యాట్ కమిన్స్ ని 20.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది సన్రైజర్స్. దీంతో అతనికి కెప్టెన్సీ అప్పగించడం ఖాయమని అందరూ అనుకున్నారు.

 అయితే అందరూ అనుకున్నట్లుగానే ఇటీవలే సన్రైజర్స్ తమ కొత్త కెప్టెన్ కమిన్స్ అంటూ సన్రైజర్స్  ప్రకటించింది. అయితే ఇలా కమిన్స్ కు సారధ్య బాధ్యతలు అప్పగించడం పై మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టి20 ఫార్మాట్లో కమిన్స్ ఈ మధ్యకాలంలో రికార్డు అస్సలు బాగాలేదు అంటూ గుర్తు చేశాడు. బౌలింగ్లో ధారాళంగా పరుగులు ఇస్తూ ఇటు బ్యాటింగ్ లోను విఫలమవుతున్నాడు అంటూ పేర్కొన్నాడు. మార్కరమ్ నే ఈ సీజన్ కి కూడా కెప్టెన్ గా కొనసాగించి ఉంటే బాగుండేది అంటూ అభిప్రాయపడ్డాడు ఆకాశ చోప్రా. కాగా సన్రైజర్స్ కొత్త కెప్టెన్ కమిన్స్ ఆస్ట్రేలియా జట్టుకు వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో సారథిగా కొనసాగుతున్నాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: