తమిళనాడు కెప్టెన్ పై.. ఆ జట్టు కోచ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. ఏమన్నాడో తెలుసా?

praveen
ప్రస్తుతం భారత ఆటగాళ్లు అందరూ కూడా ఫుల్ బిజీగా ఉన్నారు. ఒకవైపు జాతీయ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్ళు ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ ఆడుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక మరోవైపు ఇక భారత జట్టులో ఛాన్స్ దక్కించుకోని యువ ఆటగాళ్లు ఇక ప్రతిష్టాత్మకమైన దేశవాళి టోర్నీగా పిలుచుకుని రంజీ ట్రోఫీలో వరుసగా మ్యాచ్లు ఆడుతూ బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ రంజీ ట్రోఫీలోఎంతోమంది ప్లేయర్లు తమ ప్రదర్శనతో వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉన్నారు. మెరుపు సెంచరీలు, డబుల్ సెంచరీలు చేస్తూ ఎన్నో రికార్డులు కూడా క్రియేట్ చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే ఈ ఏడాది రంజి సీజన్లో అటు తమిళనాడు జట్టు కూడా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ దూసుకొచ్చింది. ప్రత్యర్ధులను ఓడిస్తూ సెమీఫైనల్ వరకు చేరుకుంది అని చెప్పాలి. అయితే సెమీఫైనల్ లో అటు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం కాస్త తడబాటుకు గురైంది తమిళనాడు జట్టు. ఈ క్రమంలోనే ఆ జట్టు ఆటతీరుపై విమర్శలు వచ్చాయి అని చెప్పాలి. ఏకంగా ఇక సెమి ఫైనల్ వరకు దూసుకు వచ్చి చివరికి సెమిస్ లో ముంబై చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో తమిళనాడు జట్టు ఫ్యాన్స్ అందరూ నిరాశలో మునిగిపోయారు.

 అయితే రంజీ ట్రోఫీ సెమీఫైనల్ లో ముంబై చేతిలో ఓటమి అనంతరం తమిళనాడు కోచ్ సులెక్షన్ కులకర్ణి చేసిన వ్యాఖ్యలు కాస్త వివాదాస్పదంగా మారిపోయాయి అని చెప్పాలి. మేము తొలిరోజు 9 గంటలకు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నప్పుడే ఓడిపోయాం. అది బౌలింగ్ పిచ్.  కానీ మా కెప్టెన్ సాయి కిషోర్ బ్యాటింగ్ తీసుకున్నాడు. కోచ్గా కెప్టెన్ కు సూచన మాత్రమే ఇవ్వగలను అంతకుమించి ఏం చేయలేను అంటూ సులక్షన్ కులకర్ణి సంచలన వ్యాఖ్యలు చేశాడు. కాగా ఈయన వ్యాఖ్యలను అటు టీమిండియా మాజీ ప్లేయర్ దినేష్ కార్తీక్, ఇక మాజీ కెప్టెన్ బధాని కూడా తప్పుపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: