ధోని ఒకే ఒక్కడు.. కానీ అతన్ని అందుకే మహితో పోల్చా : గవాస్కర్

praveen
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏకంగా ఒక రైల్వే టికెట్ కలెక్టర్ స్థాయి నుంచి దేశం గర్వించదగ్గ క్రికెటర్ స్థాయికి ఎదిగిన ధోని ప్రస్థానం ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తిదాయకం అని చెప్పాలి. ఒక సాధారణ క్రికెటర్ గా జాతీయ జట్టులోకి వచ్చి ఏకంగా కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాడు. కెప్టెన్సీ చేపట్టిన తర్వాత టీమ్ ఇండియాకు అందని ద్రాక్షలా ఉన్న వరల్డ్ కప్ ను రెండుసార్లు అందించాడు మహేంద్ర సింగ్ ధోని. ఇక తన కెప్టెన్సీ తో భారత క్రికెట్ అనే పుస్తకంలో ప్రత్యేకమైన పేజీలు లికించుకున్నాడు అని చెప్పాలి.

 అందుకే యుగానికిఒక్కడే యుగపురుషుడు ఉంటాడు. అలాగే భారత క్రికెట్ కి అతని తరానికి ధోని ఒక్కడు మాత్రమే ఇలాంటి యుగ పురుషుడు అని క్రికెట్ విశ్లేషకులు కూడా అభివర్ణిస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇక ధోని లాగా ఎవరైనా యువ ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్లో రాణించాడు అంటే చాలు అతని ధోనితో పోల్చి ప్రశంసలు కురిపించడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇటీవలే అటు భారత జట్టు తరఫున ఛాన్స్ దక్కించుకొని మంచి ప్రదర్శన చేసిన దృవ్ జురేల్ పై కూడా ఇలాంటి ప్రశంసలు కురిపించారు కొంతమంది మాజీలు. ఏకంగా అతన్ని మాజీ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనితో పోల్చారు అని చెప్పాలి. అయితే ఆ యువ ఆటగాడిని ధోని లాంటి లెజెండ్ తో పోల్చడం ఏంటి అని కొన్ని విమర్శలు కూడా వచ్చాయ్.

 ఇక ఇదే విషయంపై టీమిండియా మాజీ ప్లేయర్ గవాస్కర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎంఎస్ ధోని వంటి మరో ఆటగాడు ఇక క్రికెట్లోకి రాడు అంటూ గవాస్కర్ చెప్పుకొచ్చాడు. అయితే యువ ఆటగాడు దృవ జురెల్ ను తాను ధోనితో పోల్చడం వివరణ ఇచ్చాడు. ఆ వ్యాఖ్యల్లో నా ఉద్దేశం జూరెల్ సమయస్ఫూర్తి ఆటతీరు ధోనిని గుర్తు చేస్తున్నాయి అనే తప్ప. అతను ధోనితో సమానం అని కాదు. ధోని లాంటి ఆటగాడు ఒక్కరు మాత్రమే. ఇక మరొకరు రారు కూడా అంటూ గవాస్కర్ వ్యాఖ్యానించాడు. ధోని సాధించిన దాంట్లో జురెల్ కొంత సాధించిన భారత క్రికెట్కు మేలు చేకూరినట్లే అంటూ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: