ఆ ఒక్క అడ్డు తొలగితే.. ముంబై ఆరో టైటిల్ గెలిచినట్లే?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో మోస్ట్ సక్సెస్ఫుల్ టీం గా కొనసాగుతుంది ముంబై ఇండియన్స్. ఏకంగా రోహిత్ శర్మ కెప్టెన్సీ లో ఐదు సార్లు టైటిల్ విజేతగా కూడా నిలిచింది. ఇక ప్రతిసారి ఐపీఎల్ వేలంలో ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ప్రత్యర్థులను చిత్తు చేస్తూ ఉంటుంది ఈ జట్టు. ఈ క్రమంలోనే ఎంతో మంది యంగ్ ప్లేయర్లను ఇప్పటివరకు స్టార్ ప్లేయర్లుగా మార్చిన ఘనత కూడా ముంబై ఇండియన్స్ సొంతం అని చెప్పాలి.

 అయితే గత కొన్ని సీజన్స్ నుంచి మాత్రం ముంబై ఇండియన్స్ ఎందుకో ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేక పోతుంది. ఈ క్రమంలోనే గత రెండు సీజన్స్ నుంచి కూడా పేలవ ప్రదర్శనతో అభిమానులకు సైతం చిరాకు తెప్పిస్తుంది అన్న విషయం తెలిసిందే. అయితే మార్చి 22వ తేదీ నుంచి 2024 ఐపీఎల్ సీజన్ ప్రారంభం కాబోతూ ఉండగా.. ఇక మరోసారి టైటిల్ విజేతగా నిలవాలని అటు ముంబై ఇండియన్స్ ఇప్పటికే అన్ని రకాల ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుంది. ఈ క్రమంలోనే ఇక ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందే ట్రోఫీ కోసం పనులు మొదలుపెట్టింది ముంబై ఇండియన్స్.

 ఇప్పటికే జట్టు బలంగా మారడానికి కావాలనుకున్న ఆటగాళ్లను సొంతం చేసుకుంది  గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ట్రేడ్ చేసుకుని అతని చేతిలో కెప్టెన్సీ కూడా పెట్టేసింది జట్టు యాజమాన్యం. అయితే 2020 సీజన్ వరకు ముంబై తో మ్యాచ్ అంటే చాలు ప్రత్యర్థి జట్టు ప్రత్యేక ప్రణాళికలు రచించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ముంబై తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతోంది. 2021, 2022 సీజన్లలో అటు ప్లే ఆఫ్ కి కూడా అర్హత సాధించలేకపోయింది. చివరికి 2022 సీజన్లో దారుణమైన ప్రదర్శనతో పాయింట్స్ టేబుల్ లో అట్టడుగున నిలిచింది. ఈ క్రమంలోనే జట్టు కోసం కీలక నిర్ణయాలు తీసుకుంది ఆ ఫ్రాంచైజీ. మునుపటి వైభవాన్ని తీసుకురావాలని దూకుడైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది.

 అయితే ఎంతలా ప్రణాళికలను సిద్ధం చేసుకున్నప్పటికీ ముంబై ఆరో టైటిల్ సాధించడానికి ఒక సమస్య అడ్డుపడుతుంది. ముంబై ఇండియన్స్ లో అంతర్యుద్ధం నెలకొందని కథనాలు వస్తున్నాయి  కెప్టెన్సీ మార్పుతో జట్టు రెండు వర్గాలుగా చీలిపోయిందని కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయ్. ఒకవేళ ఈ ప్రచారం నిజమైతే ముంబై ఇండియన్స్ కి కష్టాలు తప్పవు. కలిసికట్టుగా బరిలోకి దిగితేనే ముంబై ఆరో టైటిల్ సాధించగలదు. ఇక ఈ ఒక్క సమస్య తీరిపోయింది అంటే 2024 ఐపీఎల్ సీజన్లో అటు ముంబై ఇండియన్స్ తప్పకుండా ఆరో టైటిల్ విజేతగా నిలవడం ఖాయమని ఎంతోమంది క్రికెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: