అయ్యారే అయ్యర్.. బీసీసీఐకి అంత పెద్ద అబద్ధం చెప్పాడా?

praveen
భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆటగాళ్లు ఎవరైనా నియమ నిబంధనలు పాటించకపోతే ఎంత కఠినంగా వ్యవహరిస్తూ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇటీవల ఇది మరోసారి రుజువు అయింది. శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ విషయంలో కాస్త కఠినంగా వ్యవహరించింది బీసీసీఐ.  ఇటీవల సెంట్రల్ కాంట్రాక్టుకు సంబంధించిన వివరాలను ప్రకటించింది. అయితే ఇక ఎంతోమంది యువ ఆటగాళ్లకు సెంట్రల్ కాంట్రాక్టులో అవకాశం కల్పించిన బీసీసీఐ.. ఎన్నో ఏళ్ల నుంచి ఈ కాంట్రాక్ట్ లో వరుసగా అవకాశం దక్కించుకుంటూ వస్తున్న శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లను మాత్రం ఇక ఈ కాంట్రాక్ట్ నుంచి తప్పించింది.

 అయితే ఈ విషయం గురించి ప్రస్తుతం భారత క్రికెట్లో చర్చ జరుగుతూ ఉంది అని చెప్పాలి. ఈ ఇద్దరు దేశవాళీ క్రికెట్లో ఆడాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లు పట్టించుకోకపోవడంతోనే బీసీసీఐ వారిపై ఇలాంటి చర్యలు తీసుకుంది అని ఇక కొన్ని వార్తలు కూడా తెరమీదకి వచ్చాయి. అయితే ఇక ఇప్పుడు శ్రేయస్ ఒక పెద్ద అబద్ధం చెప్పడం కారణంగానే బీసీసీఐ ఏకంగా అతని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది అన్న విషయం కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ తర్వాత వెన్ను నొప్పి కారణంగా శ్రేయస్ అయ్యర్ జట్టుకు దూరంగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే.

 ఇక ఆ తర్వాత జరిగిన టెస్ట్ మ్యాచ్లకు కూడా అతను అందుబాటులోకి రాలేదు అయితే శ్రేయస్ నిజంగానే వెన్ను నొప్పితో బాధపడలేదని.. గాయం ఉంది అంటూ అతను ఏకంగా సెలెక్టర్లకు అబద్ధం చెప్పాడు అంటూ ఒక వార్త వైరల్ గా మారిపోయింది. రెండవ టెస్టు తరువాత వెన్ను నొప్పి ఉంది అని అబద్ధం చెప్పి అతను జట్టు నుంచి తప్పుకున్నాడట. ఇక నేషనల్ క్రికెట్ అకాడమీ మెడికల్ టీం అయ్యర్ ఫిట్గా ఉన్నట్లు నివేదిక ఇవ్వడంతో ఈ విషయం బహిర్గతం అయిందట. ఇక తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ నిర్వహించిన ప్రీ సీజన్ క్యాంపులో పాల్గొనడం కూడా అటు సెలెక్టర్లకు రుచించలేదు  ఈ క్రమంలోనే అతనిపై సెంట్రల్ కాంట్రాక్టు విషయంలో వేటు వేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: