సౌత్ ఆఫ్రికా తరఫున ఆడిన.. ఇండియన్ క్రికెటర్.. ఎవరో తెలుసా?

praveen
సాధారణంగా వరల్డ్ క్రికెట్లో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న ఎంతోమంది ఆటగాళ్ళు ఏకంగా ఒకటి కాదు రెండు దేశాల తరఫున ఆడిన వాళ్ళు ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఏకంగా ఒక దేశం తరఫున ప్రాతినిధ్యం వహించి ఇక మరో దేశం తరుపున జాతీయ జట్టులోకి వచ్చి అక్కడ స్టార్ ప్లేయర్లుగా ఎదిగిన వారు ఉన్నారు. అయితే ఇలాంటి ఆటగాళ్లకు సంబంధించి వార్తలు అప్పుడప్పుడు వైరల్ గా మారిపోతూ ఉంటాయి.  కానీ ఇండియన్ క్రికెట్లో మాత్రం ఇలాంటివి అస్సలు కుదరదు. ఎవరైనా ఆటగాడు విదేశీ జట్టు తరఫున ఆడాలి అనుకుంటే ఇక అన్ని ఫార్మాట్లో నుంచి కూడా రిటైర్మెంట్ ప్రకటించాలి. బీసీసీఐ తో ఉన్న అన్ని సంబంధాలను తెంచుకోవాలి. అలాంటప్పుడు మాత్రమే విదేశీ టీమ్లకు ఆడేందుకు అవకాశం ఉంటుంది.

 అందుకే ఇప్పటివరకు ఎంతోమంది విదేశీ ప్లేయర్ల లాగా ఇండియన్ ప్లేయర్లు ఇండియాకు కాకుండా మరో దేశానికి ఆడిన దాఖలాలు కూడా లేవు అని చెప్పాలి. కానీ ఇక్కడ ఒక క్రికెటర్ మాత్రం ఏకంగా ఇండియాకు మాత్రమే కాదు సౌత్ ఆఫ్రికా తరఫున కూడా ఆడాడు. ఈ క్రమంలోనే అతని పేరు కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది . అయితే అతను ఆడింది ఇప్పుడు కాదు ఏకంగా 2015లో ఒక యంగ్ క్రికెటర్.. ఇలా ఇండియాతో పాటు సౌత్ ఆఫ్రికా జట్టు తరఫున కూడా ఆడాడు అన్న విషయం కాస్త వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. అదేంటి ఇండియన్ క్రికెటర్ వేరే దేశానికి ఆడటమేంటి అని.. బీసీసీఐ రూల్స్ ప్రకారం అది సాధ్యం కాదు కదా అనుకుంటున్నారు కదా.

 కానీ ఒకసారి మాత్రం ఇది సాధ్యమైంది. 2017లో టీమిండియాతో సౌత్ ఆఫ్రికా ఏ జట్టు తలపడింది. అయితే ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాకు చెందిన నలుగురు ప్లేయర్లు కూడా అస్వస్థతకు గురయ్యారు. దీంతో సౌత్ ఆఫ్రికా టీం మేనేజ్మెంట్ ఒక ప్లేయర్ కావాలని టీమ్ ఇండియాను రిక్వెస్ట్ చేసింది. దీంతో టీమిండియా జట్టుకు 12వ ప్లేయర్ గా ఉన్న మన్ దీప్ సింగ్ సౌత్ ఆఫ్రికా జెర్సీ ధరించి ఆ జట్టు తరఫున ఆడాడు. కాగా ఈ ఆటగాడు గతంలో ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ జట్టు తరఫున ఆడిన సంగతి తెలుస్తుంది. ఇలా ఇండియన్ క్రికెటర్ అయ్యుండి రెండు దేశాల తరఫున ఆడిన ప్లేయర్గా రికార్డు సృష్టించాడు ఈ యువ ఆటగాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: