బిగ్ షాక్ : ఆ ఇద్దరు ప్లేయర్లకు.. సెంట్రల్ కాంట్రాక్ట్ రద్దు చేయబోతున్న బీసీసీఐ?

praveen
బీసీసీఐ ప్రతి ఏడాది నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ నేపథ్యంలో ఇటీవల కాలంలో దేశవాలి క్రికెట్ కి పెద్దగా ఆదరణ లేకుండా పోయింది అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు దేశవాళి క్రికెట్ లో బాగా రాణించిన ఆటగాళ్లకే ఇక భారత జాతీయ జట్టులో ఛాన్స్ దక్కేది. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగానే ఎంతోమంది యువ ఆటగాళ్లు ఇక భారత జట్టులోకి రావడం కూడా చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే ఎవరైనా ఆటగాడు ఫామ్ కోల్పోయిన ఐపీఎల్ లో ఆడి అదరగొట్టి మళ్ళీ జాతీయ జట్టులోకి రావాలనుకుంటున్నారు. కానీ ఇక దేశవాళీ టోర్నీలలో ఆడేందుకు మాత్రం ఆసక్తి చూపించడం లేదు.

 ఈ క్రమంలోనే ఇలా దేశవాళి క్రికెట్కు దూరంగా ఉంటున్న ఆటగాళ్లపై గత కొంతకాలం నుంచి బీసీసీఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలోనే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమవుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఇషాన్ కిషన్ అటు భారత జట్టులోకి రావాలి అంటే దేశవాళీ క్రికెట్లో ఫామ్ నిరూపించుకోవాలని బీసీసీఐ చెప్పిన అతను మాత్రం పట్టించుకోలేదు. దీంతో అతన్ని సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తొలగించేందుకు సిద్ధమైంది బీసీసీఐ. ఈ క్రమంలోనే ఇలా దేశవాళీ క్రికెట్ ను దూరంగా పెడుతున్న ఆటగాళ్లను ఇషాన్ కిషన్ తో పాటు శ్రేయస్సు అయ్యర్ కూడా ఉన్నాడు. ఇతనిపై కూడా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైందట బీసీసీఐ.

 శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లకు బిసిసిఐ త్వరలోనే బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. వారిద్దరి సెంట్రల్ కాంట్రాక్టులను రద్దు చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే 2023 - 24 సీజన్ కు సంబంధించి బిసిసిఐ ఇప్పటికే సెంట్రల్ కాంట్రాక్టు కు సంబంధించిన జాబితాను సిద్ధం చేసినట్టు తెలుస్తుంది అ. యితే ఈ జాబితాలో అటు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ పేర్లు లేవట. దీంతో ఈ విషయం తెలిసి అభిమానులు అందరూ కూడా షాక్ అవుతున్నారు. దేశవాళీ క్రికెట్లో ఆడమని బీసీసీఐ ఆదేశాలు ఇచ్చిన ఇద్దరు క్రికెటర్లు కూడా పట్టించుకోకపోవడంతోనే బిసిసిఐ పెద్దలు ఈ స్టార్ ప్లేయర్స్ పై ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: