రోహిత్ నిర్ణయం.. చివరికి టీమిండియా కొంపముంచింది?

praveen
ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే మూడు మ్యాచ్లను ముగించుకున్న టీమిండియా ఇక ఇప్పుడు రాంచి వేదికగా నాలుగో టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది. అయితే ఈ నాలుగో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదట బ్యాటింగ్ చేయడానికి నిర్ణయించుకుంది. అయితే భారత బౌలర్లు చెలరేగిపోవడంతో అటు ఇంగ్లాండ్ జట్టు తక్కువ పరుగులకు ఎక్కువ వికెట్లు కోల్పోయి పీకల్లోకి కష్టాల్లో పడింది. ఇలాంటి సమయంలో ఏకంగా ఇంగ్లాండ్ జట్టు తక్కువ పరుగులకే ఆల్ అవుట్ అవ్వడం ఖాయమని అందరూ అనుకున్నారు.

 కానీ ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లు మాత్రం క్రీజులో నిలదొక్కుకొని పరుగుల వరద పారించడంతో ఇంగ్లాండు జట్టు ప్రస్తుత మెరుగైన స్థితిలో ఉంది. 90 ఓవర్లల్ 7 వికెట్లు కోల్పోయి 302 పరుగులు చేసింది. ఇక ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ జోరూట్ 226 బంతుల్లో 106 పరుగులు చేశాడు. మరోవైపు హోలీ రాబిన్సన్ 31 పరుగులతో ఉన్నాడు. అయితే 60 ఓవర్ల లోపే టీమిండియా తమ రివ్యూ లన్ని కోల్పోయింది అని చెప్పాలి. ఇక సహచర ఆటగాళ్ల ఒత్తిడితో కెప్టెన్ రోహిత్ శర్మ రివ్యూలు తీసుకోవడంలో కాస్త గందరగోళానికి గురయ్యాడు. దీంతో రోహిత్ శర్మ కారణంగా టీమిండియా రివ్యూలు కోల్పోయింది.

 ఈ క్రమంలోనే రివ్యూలు తీసుకోవడం విషయంలో తడబాటుకు గురైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పై భారత మాజీ ప్లేయర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్ల సిఫార్సులను తీసుకోవడం అన్నిసార్లు సమంజసం కాదు. తొలుత రివ్యూ కోసం రోహిత్ ఆసక్తి చూపించలేదు. కానీ అతడిని బలవంతంగా ఒప్పించారు. టర్న్ కొంచమే అయినట్లు కనిపిస్తుంది. బంతి ఎదుర్కోవడానికి బ్యాట్స్మెన్ ఇబ్బంది పడ్డాడు. బంతి బ్యాక్ పాడ్ కూడా తగల్లేదు. ఫ్రంట్ ప్యాడ్ కు తగిలింది. ఇక ఇప్పుడు తప్పుడు రివ్యూలు తీసుకోవడం కారణంగా భారత జట్టుకు రివ్యూలు లేకుండా పోయాయి. బౌలర్లు వికెట్లు సాధించాలనే ఆరాటంలో  ఉంటారు. దాన్ని అర్థం చేసుకోగలను. కానీ బంతి బ్యాటర్ పాడ్లను ఎక్కడ తగిలిందో కూడా గమనించాలి. రివ్యూలను కోల్పోకుండా జాగ్రత్త వహించాలి అంటూ సునీల్ గవాస్కర్ సూచించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: